Monday, October 27, 2025 10:50 PM
Monday, October 27, 2025 10:50 PM
roots

జగన్ కామెంట్స్ తో డైలమాలో వైసీపీ సోషల్ మీడియా

సాధారణంగా వైసిపి అధినేత వైయస్ జగన్ రాజకీయం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఎక్కడికైనా వెళ్తే మీడియా దృష్టి మొత్తం తన వైపుకు తిప్పుకునే విషయంలో జగన్ ఒక రకంగా పీహెచ్డీ చేశారు. తాజాగా వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలుకు వెళ్లిన జగన్… తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ అధికారులకు ఇచ్చిన వార్నింగ్ ఒక సంచలనం అయితే… ఇక వంశీని అరెస్టు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి జగన్ కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేశారు.

Also Read : కడప నేతలు ఎక్కడ..? జగన్ కు దూరమా..? కూటమి అంటే భయమా..?

చంద్రబాబు కంటే లేదంటే లోకేష్ కంటే వంశీ అందంగా ఉన్నాడని.. అందుకే అరెస్టు చేశారని జగన్ కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో జగన్… చంద్రబాబు నాయుడు, అచ్చేన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, కొల్లు రవీంద్ర.. ఇలా దాదాపు పదుల సంఖ్యలో నాయకులను అరెస్టులు చేశారు. వాళ్ళందర్నీ బెయిల్ రాకుండా నానా ఇబ్బందులు పెట్టారు. కేసులు మీద కేసులు పెడుతూ ఇబ్బందులు గురి చేశారు.

Also Read : ఆ ఇద్దరి కోసం అగార్కర్, గంభీర్ మధ్య వాగ్వాదం

మరి వాళ్ళందరూ అందంగా ఉన్నారా? అందుకే జగన్ ఓర్వలేక కేసులు పెట్టారా అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఇక పోలీస్ అధికారులను అలాగే నాయకులను బట్టలూడదీస్తామని జగన్ చేసిన కామెంట్ కూడా ఆశ్చర్యకరంగా అనిపించింది. 2019 నుంచి 2024 వరకు నాయకులను, కార్యకర్తలను సాధారణ ప్రజలను కూడా అనేక ఇబ్బందులు గురి చేశారు. అప్పట్లో పోలీస్ అధికారులు అలాగే కొంతమంది నాయకులు కీలక పాత్ర పోషించారు. అందులో వైఎస్ జగన్ కూడా ఉన్నారు. మరి వీరిని ఏం చేయాలి అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఇక జగన్ కామెంట్స్ ను వైసీపీ సోషల్ మీడియా పెద్దగా ప్రమోట్ చేయకపోవడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్