ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి జగన్ ఇప్పటినుంచే తీవ్ర కష్టాలు పడుతున్నారు. పార్టీ నాయకుల్లో ధైర్యాన్ని నూరి పోసేందుకు ఆయన ఉన్న అన్ని అవకాశాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు దిశగా కూడా జగన్ అడుగులు వేస్తున్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. పార్టీకి సమర్ధవంతంగా పనిచేయని నాయకులను పక్కన పెట్టేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : వైసీపీలో ఊపు వస్తుందా.. సాధ్యమేనా..?
ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నియోజకవర్గాల్లో నాయకత్వం మార్పు దిశగా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఇంచార్జ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మార్చడానికి జగన్ సిద్ధమైనట్లు సమాచారం. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు ఆయన జైల్లో ఉన్నారు. ఇక ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు.
Also Read : ఇంగ్లీష్ టూర్.. సెలెక్టర్లు సంచలన నిర్ణయం..?
ఇక విమర్శలు చేసే విషయంలో కూడా ఆయన వెనుకబడి ఉన్నారు. అధికార పార్టీకి భయపడే సైలెంట్ గా ఉంటున్నారు అనే భావన ఆ పార్టీ కార్యకర్తల్లో సైతం నెలకొంది. మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావడంతో జగన్ ఆయన పై చాలా ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం అండగా నిలబడిన సరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో వెనుకబడి ఉండటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జ్ ను మార్చేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే ఒక కొత్త నాయకుడిని నియోజకవర్గంలో పరిచయం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.