Friday, September 12, 2025 05:23 PM
Friday, September 12, 2025 05:23 PM
roots

టార్గెట్ బడా నిర్మాతలు.. హైదరాబాద్ లో భారీగా ఐటి సోదాలు..!

హైదరాబాద్ లో సినిమా వాళ్ళను టార్గెట్ చేసారు ఐటి అధికారులు. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ హడావుడి చేస్తున్న నిర్మాతల లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగారు. నేటి ఉదయం నుంచి హైదరాబాద్ లో కీలక ప్రాంతాల్లో రంగంలోకి దిగిన ఐటి అధికారులు భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా పలుచోట్ల ఐటీ దాడులు జరిగాయని మీడియాలో వచ్చిన వార్తలు సినీ రంగాన్ని కలవరపెట్టాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read : వైసీపీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజేపి, జనసేన

హైదరాబాద్‌లో 8 చోట్ల తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ముందు తనిఖీలు నిర్వహించారు. ఎఫ్ డి సి చైర్మన్ గా ఉన్న దిల్ రాజుతో పాటుగా మరో నిర్మాత శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలలో ఐటి సోదాలు జరిగాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను తీసింది దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ సినిమాలకు భారీగా వసూళ్లు వచ్చినట్టు ప్రకటనలు వచ్చాయి. దీనితో ఐటి అధికారులు ఫోకస్ చేసారు.

Also Read : ఏపిలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు

ఇక మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. పుష్ప-2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్.. భారీగా వసూళ్లు వచ్చినట్టు ప్రకటనలు ఇచ్చింది. దాదాపు 2 వేల కోట్ల వసూళ్లు వచ్చినట్టు ప్రకటించింది. మ్యాంగో మీడియా సంస్థపైనా ఐటీ దాడులు జరిగాయి. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో సంస్థలో కూడా సోదాలు జరిగాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్