Friday, August 29, 2025 09:31 PM
Friday, August 29, 2025 09:31 PM
roots

ఆ విషయంలో వైసీపీ స్టాండ్ మారిందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి తొలి నుంచి వివాదాస్పదమవుతోంది. విభజన నేపథ్యంలో అనాథలా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో దీంతో విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయం కూడా తీసుకున్నారు. ప్రధానంగా 3 ప్రాంతాలను రాజధానికి అనుకూలంగా గుర్తించారు. దొనకొండ, అమరావతి, నూజివీడు ప్రాంతాల్లో అన్ని విధాలుగా, అందరికీ అనుకూలమైన ప్రదేశంగా అమరావతిని ఎంపిక చేశారు.

Also Read : రెండు పెన్షన్లు.. చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్

శ్రీ కృష్ణ కమిటీ సూచనలపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అప్పట్లో రాజధాని కోసం కనీసం 30 వేల ఎకరాలు అయినా కావాలని నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లోనే సూచించారు కూడా. దీంతో అమరావతి కోసం 33 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇక ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలైంది. అమరావతి శంకుస్థాపనకు వైసీపీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. వైసీపీ గెలిస్తే అమరావతి నిర్మాణం ఆగిపోతుందని చంద్రబాబు 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే జగన్ మాత్రం.. నా ఇల్లు అమరావతి పరిధిలోనే ఉంది.. ఏపీ రాజధానని అమరావతి మాత్రమే అని స్పష్టం చేశారు.

ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన మాట తప్పారు. ఏపీకి 3 రాజధానులు కావాలని వింత వాదన తెరపైకి తీసుకువచ్చారు. అమరావతి, విశాఖ, కర్నూలును రాజధానులుగా ప్రకటించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. చివరికి న్యాయపోరాటాల వల్ల 3 రాజధానుల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇదే సమయంలో అమరావతిపై వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేశారు. స్మశానం అని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని, కమ్మరావతి అని.. వ్యాఖ్యలు చేశారు. చివరికి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఆ అమరావతి ఉద్యమం కూడా ఓ కారణమైంది. అయినా సరే.. వైసీపీ నేతలు మాత్రం అమరావతిపై ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆపలేదు.

Also Read : మంత్రులకు ర్యాంకులు కరెక్టేనా..? వద్దంటున్న కార్యకర్తలు

ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా జులై 2వ వారంలోనే కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరద నీరు చేరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులతో పాటు ప్రకాశం బ్యారేజ్ గేట్లు కూడా ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 2 వేల టీఎంసీల నీరు సముద్రం పాలయ్యినట్లు అధికారులు వెల్లడించారు. వీటికి తోడు మరోవైపు భారీ వర్షాలు. దీంతో అమరావతిలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. నిర్మాణంలో ఉన్న ప్రాంతాల్లో కాలువల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లే నీరు నిలిచిందనేది ప్రభుత్వం మాట. కానీ వైసీపీ నేతలు మాత్రం ముంపు ప్రాంతమని, పడవల్లో ప్రయాణం చేయాలని వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అంబటి రాంబాబుతో పాటు వైసీపీ బడా నేతలు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

అయితే అమరావతిపై నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల తమకే నష్టమనే విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తించినట్లున్నారు. వాస్తవానికి అమరావతిలో అన్ని నిర్మాణాలు పూర్తయితే.. మురుగు నీటి పారుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు అనేది ఇంజనీర్ల మాట. దీనిపై అంతర్జాతీయ స్థాయి నిపుణుల బృందం కూడా ఒకటికి రెండుసార్లు పర్యటనలు చేసి నో ప్రాబ్లం అని సర్టిఫై చేసింది. దీంతో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. దీంతో వైసీపీ నేతల ప్రచారానికి పస లేకుండా పోయింది. పైగా అమరావతిలో ఎలాంటి ముంపు లేదంటున్న ఆ ప్రాంత రైతులు.. జగన్ ఇల్లు మునిగిందా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో.. వైసీపీ నేతలు అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి అని తెలుసుకున్నారు.

Also Read : ఉత్తరాంధ్రలో వైసీపీకి జనసేన దెబ్బ..?

ఇక మీదట అమరావతిపై ఎలాంటి నెగిటివ్ ప్రచారం చేయకూడదని వైసీపీ అగ్రనేతలు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల టీడీపీకే మేలు జరుగుతుంది తప్ప.. వైసీపీకి పైసా కూడా లాభం లేదంటున్నారు. అమరావతి నిర్మాణం పూర్తి చేసే దిశగా చంద్రబాబు ప్రణాళికలు వేస్తున్నారని.. అప్పుడు వైసీపీ పైన జనంలో మరింత వ్యతిరేకత భావన వస్తుందంటున్నారు. కాబట్టి అమరావతి ప్రాంతంపై కాకుండా.. అక్కడ జరుగుతున్న అవినీతిని గుర్తించాలని కిందిస్థాయి నేతలను వైసీపీ అగ్రనేతలు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణీ ప్రభావంతో.. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయినా సరే వైసీపీ నేతలు మాత్రం అమరావతి ముంపు అంటూ కనీసం ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. మొత్తానికి వైసీపీ నేతలకు ఇంతకాలానికి తెలిసి వచ్చిందా అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్