Friday, September 12, 2025 05:11 PM
Friday, September 12, 2025 05:11 PM
roots

లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయకుండా ఇన్ని జరుగుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెడ్ బుక్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెడ్ బుక్ విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు కొందరు అనవసరంగా తొందర పడుతున్నారని, టిడిపి సోషల్ మీడియా కూడా రెడ్ బుక్ విషయంలో లేని పోని ఆశలు పెట్టుకుని, ఎక్కువ ఊహించుకుని మంత్రి లోకేష్ ను విమర్శిస్తుంది అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక జగన్ ఢిల్లీ వెళ్లి రెడ్ బుక్ కి సంబంధించి అనేక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పటికే ఓపెన్ చేసారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రెడ్ బుక్ ను ఓపెన్ చేయకుండానే ఆర్డీవో కార్యాలయానికి పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ నిప్పు పెట్టిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే విజయసాయి రెడ్డి వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే ఎక్సైజ్ శాఖ మీద ఆ స్థాయిలో దృష్టి పెట్టారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. రెడ్ బుక్ అసలు ఓపెన్ చేయకుండానే 13 ఏళ్ళకు పైగా సర్వీస్ ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఎలా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే కొందరు కీలక అధికారులు విధులకు ఏ విధంగా రాజీనామాలు చేస్తారనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

రెడ్ బుక్ ప్రభావం రోజు రోజుకి బలంగా కనపడే అవకాశం ఉండటం తోనే జగన్ ఢిల్లీ వెళ్ళారని అందుకే రెడ్ బుక్ ని హైలెట్ చేసి మాట్లాడుతున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా రెడ్ బుక్ కి సంబంధించి ఇప్పుడు అనవసరంగా తొందర పడకుండా కాస్త ఎదురు చూడటం మంచిదని, వైసీపీ తరహాలో అరెస్ట్ లు చేస్తే 11 సీట్ల పరిస్థితి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రెడ్ బుక్ పేరుతొ ప్రతీకార చర్యలకు దిగకపోయినా కనీసం తప్పు చేసిన అధికారుల పై చర్యలు తీసుకుని భయవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యాంగానికి లోబడి పని చేసే విధంగా అధికారులకి ఒక హెచ్చరిక చేయాలని ప్రజలు బలంగా కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్