Sunday, October 19, 2025 10:11 AM
Sunday, October 19, 2025 10:11 AM
roots

7 వేల అడుగులు.. ఎన్నో లాభాలు

ఈ రోజుల్లో గుండెపోటు అనే మాట వింటే గుండెల్లో రైళ్ళు కాదు.. విమానాలు ఎగురుతున్నాయి. ఎప్పుడు, ఎవరు, ఎలా గుండెపోటుతో చనిపోతున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి. ఇప్పుడు గుండెను మరింత పదిలంగా కావాల్సిన పరిస్థితి. ఇలాంటి వారికి తాజా పరిశోధన ఆసక్తికర విషయం చెప్పింది. హార్వర్డ్ హెల్త్ బయట పెట్టిన వివరాల ప్రకారం.. రోజుకు 7,000 అడుగులు నడవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు తగ్గుతుందని తేలింది. అదే విధంగా మరణ ప్రమాదాలు కూడా తగ్గుతాయని తెలిపింది.

Also Read : పెద్దిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్..? మదనపల్లి ఫైల్స్ లో కీలక పరిణామం

హార్వర్డ్ కవరేజ్ ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌ లో ప్రచురించిన కథనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారు వరకు పలువురిని పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. 1,60,000 మంది ఆరోగ్యాన్ని పరిశీలించి నివేదిక వెల్లడించారు. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు, ఇన్సులిన్ సెన్సిటివిటీ, కొలెస్ట్రాల్ నమూనాలు మెరుగుపడతాయి. రోజుకు 7,000 అడుగులు వేయడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను సైతం తగ్గించడం ఖాయమని వెల్లడించింది.

Also Read : బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం చేస్తే ఆయుష్షు తగ్గుతుందా? పరిశోధనలో సంచలనం

అంతకంటే తక్కువగా నడిచిన వారు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తించారు. రక్తపోటు నియంత్రణను మెరుగుపరుస్తుంది. నడక అనేది ఒక రకమైన ఏరోబిక్ చర్య. రక్తపోటును తగ్గించడమే కాకుండా ఈ విషయంలో దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుంది. సిస్టోలిక్, డయాస్టొలిక్ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనితో గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. తరచుగా నడవడం కారణంగా టైప్ 2 డయాబెటిస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీని వలన బేస్‌లైన్ ఫిట్‌నెస్ కూడా పెరుగుతుంది. అంటే మీరు కష్టపడే సమయంలో గుండె మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్