ఆస్ట్రేలియా పర్యటన అనగానే భారత జట్టు ఎంపిక విషయంలో ఎన్నో అంచనాలు ఉంటాయి. గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిన భారత జట్టు.. కేవలం ఒక్క విజయంతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఏడాది వన్డే సీరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్తుంది భారత జట్టు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఇదే ఆఖరి వన్డే సీరీస్ గా భావించడంతో.. దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. టి20 సీరీస్ జరిగినా అంచనాలు మొత్తం వన్డే జట్టుపైనే ఉన్నాయి. ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.
Also Read : ఏ క్షణమైనా పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్.. షాక్ ఇచ్చిన హైకోర్ట్
తాజాగా జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే శుభమన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్ పేర్లు కూడా వినపడుతున్నాయి. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ శమీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండే సూచనలు కనపడుతున్నాయి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.
Also Read : ఇదేం ప్యాలెస్.. రిషికొండ చూసి పవన్ షాక్..!
బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, గిల్, అయ్యర్, పంత్, రోహిత్ స్థానాలు ఖరారు అయినట్టు తెలుస్తోంది. అలాగే బౌలింగ్ విభాగంలో బూమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సిరాజ్ వన్డే జట్టులోకి తిరిగి రావచ్చు. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అతను ఆడలేదు. అటు కెఎల్ రాహుల్ కూడా జట్టులో ఉండనున్నాడు. యువ ఆటగాడు హర్షిత్ రానా పేరు కూడా పరిశీలిస్తున్నారు సెలెక్టర్లు. ఆసియా కప్ లో మెరుగ్గా రాణిస్తేనే అతనికి అవకాశం కల్పించే సూచనలు కనపడుతున్నాయి.




