Friday, September 12, 2025 08:16 PM
Friday, September 12, 2025 08:16 PM
roots

తిరుమలలో అపచారమా.. వాస్తవం ఏమిటి..?

తిరుమల కొండపై అపచారం జరిగిందా..? ప్రధాన ఆలయ తాళాలు ఎవరికి కావాలంటే వాళ్లకు ఇస్తున్నారా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ప్రధాన ఆలయానికి తాళం వేశారు. ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సన్నిధి గొల్లతో ప్రధాన ద్వారానికి తాళం వేయించారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ఛానల్ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో అధికారికంగా ప్రసారం కూడా చేశారు. కానీ ఈ విషయంపై మాత్రం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చ జోరుగా నడుస్తోంది.

Also Read : వారసులు.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ..?

తిరుమల కొండపైన చంద్రగ్రహణం సందర్భంగా ఆలయానికి తాళం వేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. తిరుమలలో పని చేస్తున్న వివిధ న్యూస్ ఛానల్స్ రిపోర్టర్లు ఆలయం గేటు దగ్గర తాళం పట్టుకుని ఫోటోలు దిగారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎప్పుడెప్పుడు తప్పులు దొరుకుతాయా అని ఎదురుచూస్తున్న వైసీపీ నేతల చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అయ్యింది. తిరుమల ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అపచారం అంటూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు.

Also Read : లిక్కర్ కేసులో కీలక పరిణామం.. నారాయణ స్వామి ఫోన్ లో ఏముంది..?

సన్నిధి గొల్ల చేయాల్సిన పనిని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సంస్థకు చెందిన ప్రతినిధితో చేయించారని ప్రచారం మొదలుపెట్టారు. ఆలయం దగ్గర అపచారం జరిగిందని.. ఘోరం జరిగిందని గగ్గొలు పెట్టారు. అయితే దీనికి టీడీపీ సోషల్ మీడియా ధీటుగానే బదులిచ్చింది. ఆ ఫోటోలో టీవీ 5 రిపోర్టర్‌తో పాటు సాక్షి ఛానల్ రిపోర్టర్ కూడా ఉన్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం.. కేవలం టీవీ 5 ప్రతినిధి ఉన్నంత వరకే పోస్ట్ చేసి.. అపచారం అని గగ్గొలు పెట్టారు. దీంతో పూర్తి ఫోటోను టీడీపీ నేతలు రిలీజ్ చేశారు. అందరు రిపోర్టర్లు సరదగా గేటు ముందు ఫోటో తీయించుకున్నారని.. సాక్షి ప్రతినిధి కూడా తాళం పట్టుకున్న ఫోటో పోస్ట్ చేశారు. ఇప్పుడు సాక్షి ఉద్యోగిపై చర్యలుంటాయా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి టీడీపీ బ్రేక్ వేసినట్లైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్