Saturday, September 13, 2025 05:10 AM
Saturday, September 13, 2025 05:10 AM
roots

కవిత మౌనం.. రాజకీయ వ్యూహమా?

కల్వకుంట్ల కవిత… తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లిక్కర్ స్కాంతో ఢిల్లీలో కూడా ఆమె ఫేమస్ అయ్యారు. అలాంటి కవిత ఇప్పుడు మౌనమేలనోయి ఈ మరుపు రాని రేయి అంటూ సంగీతాన్ని ఆలపిస్తూ మౌనంగా ఉండిపోయారు. అప్పట్లో పదవి ఉన్నా లేకపోయినా బోనాలకు, బతుకమ్మకు బ్రాండ్ అంబాసీడర్ గా వ్యవహరించిన కవిత… ఇప్పుడు మాత్రం అసలు గుడికి కూడా వెళ్ళడం లేదు. తెలంగాణాలో బతుకమ్మ అంటే కవితమ్మే అని ప్రచారం చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా సైలెంట్ గా ఉంది.

Also Read : రాయలసీమకు చంద్రబాబు బంపర్ ఆఫర్…!

కారణం ఏంటో తెలియదు గాని లిక్కర్ స్కాం లో బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత కవిత పెద్దగా మీడియాలో కనపడటం లేదు. దీని వెనుక కారణాలు ఎలా ఉన్నా… ఆమెను బయటకు రావద్దు అని కేసీఆర్ ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు ఆమెను అరెస్ట్ చేసిన సింపతీ బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని కేసీఆర్ భావించినా… అది జరగలేదు. ఆమెకు బెయిల్ రావడం ఆలస్యం కావడమే కాకుండా ఈ సమయంలో జరిగిన ప్రచారం మాత్రం బీఆర్ఎస్ ఇమేజ్ ను బాగా దెబ్బ తీసింది.

Also Read : టార్గెట్ పంత్.. ఆసీస్ బౌలర్ల వ్యూహం ఇదే..!

ఏకంగా బీఆర్ఎస్… కవిత బెయిల్ కోసం బిజెపిలో విలీనం అయిపోతుంది అంటూ… ప్రచారం జరిగింది. ఇక కవిత ప్రజల్లోకి వస్తే బీఆర్ఎస్ కు మైనస్ అనే భావనలో కూడా కేసీఆర్ ఉన్నారు. అందుకే ఆమెను పెద్దగా ప్రజల్లోకి వెళ్ళవద్దు అని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక కవిత కూడా మీడియాకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. దసరా సమయంలో ఓ ఆస్పత్రిలో ఆమె టెస్ట్ లు చేయించుకున్నారు. ఆ తర్వాత కుల గణన పత్రం నింపుతూ కనిపించారు. అంతే గాని ఆమె పెద్దగా అసలు కనపడటం లేదు. లిక్కర్ కేసు విచారణకు ఆన్లైన్ లో హాజరు అవుతున్నారు అంతే. మరి కవిత మౌనానికి కారణాలు ఏంటో బీఆర్ఎస్ నేతలే చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్