Friday, September 12, 2025 05:23 PM
Friday, September 12, 2025 05:23 PM
roots

ఎన్టీఆర్ కు ఆహ్వానం లేదా.. సోషల్ మీడియా చేతికి కొబ్బరి చిప్ప

సోషల్ మీడియాలో.. ఏ చిన్న విషయం దొరికినా సరే దాని గురించి పెద్ద రచ్చ చేయడంలో జనాలు ముందుంటారు. ఇప్పుడు టిడిపి సోషల్ మీడియాలో కొంతమందికి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త కొబ్బరిచిప్పలా దొరికింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నారు. 2014 తర్వాత ఆయన అమరావతిలో ఇల్లు కట్టుకోలేదు అనేది వైసీపీ ప్రధాని ఆరోపణ. ఇప్పుడు ఆరోపణలను కొట్టి పారేస్తూ చంద్రబాబు నాయుడు శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

Also Read : అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. అసలేం జరిగింది..?

దీనిని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నారా, నందమూరి కుటుంబాలు తీసుకున్నాయి. దీనికి బుధవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదు అనేది కొంతమంది మాట. ఇక దీనికి వైసీపీ సోషల్ మీడియా కూడా వంత పాడుతుంది. నందమూరి, నారా కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే విజయవాడ చేరుకున్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా హైదరాబాదులోనే ఉన్నాడు. దీనితో అతన్ని కావాలనే ఆహ్వానించలేదంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Also Read : నారా చంద్రబాబు నాయుడు.. C/o అమరావతి

కార్యక్రమానికి సంబంధించి అధికారిక ప్రకటన గాని హడావుడిగానే ఏ విధంగా జరగలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మధ్యకాలంలో కాస్త దూరంగానే ఉంటున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు మినహా ఎన్టీఆర్ టిడిపి తో సన్నిహితంగా ఉన్న సందర్భాలు ఏవీ లేవు. కానీ టిడిపి సోషల్ మీడియాలోని కొంతమంది మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదు అనే అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఒకవైపు సచివాలయం మరోవైపు హైకోర్టు ఉండే విధంగా చంద్రబాబు నాయుడు నివాసం ఉండనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్