Monday, October 27, 2025 10:36 PM
Monday, October 27, 2025 10:36 PM
roots

కూటమి.. పొత్తు ధర్మం పాటిస్తారా లేదా..?

కూటమి పొత్తు కొనసాగుతుంది.. నాలుగో సారి కూడా మోదీ ప్రధానమంత్రి అవుతారు.. ప్రతి విషయంలో పరస్పరం చర్చించుకుంటాం.. కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. ఇవే మాటలు అటు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఒకరిద్దరు మినహా పొత్తుపై స్పందించిన నేతలు ఎవరూ లేరు. ఇక ఇతర పార్టీల నేతలను చేర్చుకునే విషయంలో కూటమిలోని మిగిలిన వారితో కూడా చర్చించాలనేది టీడీపీ నేతలు మొదటి నుంచి చెబుతున్న మాట. కానీ.. ఈ మాటను బీజేపీ నేతలు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. వైసీపీ నేతలకు సైలెంట్‌గా కాషాయ కండువా కప్పేస్తున్నారు. ఇదేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఢిల్లీ పెద్దల ఆదేశం అని హస్తినపైకి నెపం నెట్టేస్తున్నారు.

Also Read : ఆ నేతల వారసులు ఏమయ్యారు..?

వాస్తవానికి 2024 ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు కూడా బీజేపీతో పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అక్రమ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడే టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. నాటి నుంచే రెండు పార్టీల నేతలు అన్ని నియోజకవర్గాల్లో కలిసే పని చేస్తున్నారు. ఇక టికెట్ల కేటాయింపు సమయంలో కూడా ఒకరిద్దరు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ పెద్దలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే బీజేపీ కూడా తమతో కలుస్తుందని పవన్ మొదటి నుంచి చెబుతున్నప్పటికీ.. ఆ దిశగా కమలం పార్టీ పెద్దలు మాత్రం అడుగులు వేయలేదు. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలతో పలుమార్లు సమావేశం అయ్యారు. సీట్ల కేటాయింపు మొదలు.. అభ్యర్థుల ప్రకటన వరకు బీజేపీ పెద్దలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. అయినా సరే.. వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ – జనసేన నేతలు.. కమలం పార్టీ పెద్దల డిమాండ్లను అంగీకరించారు. ఇందుకోసం జనసేన తాను పోటీ చేసే సీట్ల సంఖ్యను తగ్గించుకుంది కూడా.

Also Read : అఖండ2 తాండవం టీజర్

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి ఒక మంత్రిపదవి కేటాయించారు. అలాగే నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా బీజేపీకి సమన్యాయమే చేశారు చంద్రబాబు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఒకరిద్దరు పాత వారి పేర్లు సూచించిన బీజేపీ.. వారికే ఇప్పించుకోగలిగింది. ఇక ఎమ్మెల్సీగా చంద్రబాబును తిట్టిన సోము వీర్రాజును, రాజ్యసభ సభ్యునిగా టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పాకా వెంకట సత్యనారాయణకు అవకాశం కల్పించారు. ఇక అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని మోదీ.. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలోనే అమరావతి ఆగిపోయిందనే మాట కూడా మోదీ అనలేదు. ఈ విషయంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ నడిచింది కూడా. వైసీపీ – బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని.. అందుకే లిక్కర్ స్కామ్ ‌కేసులో జగన్‌ను అరెస్టు చేయటం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read : ట్రంప్ కు చుక్కలు చూపిస్తున్న గవర్నర్

ఇక ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంపై సాక్షి టీవీ డిబేట్‌లో విశ్లేషకుడు కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఖండించకుండా.. కొనసాగించారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరినైనా వదిలేది లేదన్నారు. అటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. ఒక ప్రాంత మహిళలపై బురద జల్లేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన వారిపైన తప్పనిసరిగా శాఖాపరమైన చర్యలుంటాయన్నారు కూడా.

Also Read : దుమ్ము రేపిన బాలయ్య.. షేక్ చేస్తున్న అఖండ తాండవం

అయితే ఈ వివాదంపై బీజేపీ నేతల తీరు మాత్రం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. చివరికి వైసీపీ నేతలు కూడా డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు తప్పే అని ఒప్పుకుంటున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా జగన్‌తో పాటు భారతీ రెడ్డి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సజ్జలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం కనీసం ఎక్కడా ఈ విషయంపై నోరెత్తడం లేదు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దగ్గర నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఎవరూ కనీసం స్పందించలేదు. పైగా అసలు తమకు ఈ విషయం తెలియనట్లుగా కూడా కాషాయ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.

Also Read : జనంలోకి టీడీపీ.. టార్గెట్ ఫిక్స్..!

అమరావతి రైతుల ఉద్యమానికి గతంలో బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. అలాగే అమరావతి పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు కూడా ఇచ్చారు. మరి ఇదే అమరావతి మహిళలపై వైసీపీ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కనీసం తప్పు పట్టకపోవడం ఏమిటని ఇప్పుడు ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. సాక్షి ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని.. తక్షణమే సాక్షి ప్రసారాలు నిలిపివేయాలని బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు ఇప్పటికే టీడీపీ ఎంపీలు ఫిర్యాదు కూడా చేశారు. దీనికి రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా జోక్యం చేసుకుంటే చర్యలు ఉంటాయనేది మహిళల మాట. కానీ బీజేపీ పెద్దలు, నేతలు మాత్రం ఈ విషయంతో తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Also Read : దేశాన్ని వణికిస్తున్న భూకంపాలు.. షేక్ అవుతున్న ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు

కేంద్రంలోని ఎన్‍‌‌డీఏ పాలనపై టీడీపీ – జనసేన నేతలు పదే పదే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటం లేదు. జగన్‌కు సంబంధించిన ఏ విషయంపైన అయినా సరే.. బీజేపీ నేతలు నోరెత్తడం లేదు. వాస్తవానికి ఇప్పటికే బీజేపీ – వైసీపీ మధ్య రహస్య ఒప్పందం ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వాటిని కూడా కాషాయ పార్టీ పెద్దలు ఖండించటం లేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని బీజేపీ ఇలాంటి వాటికి మద్దతిస్తుందా? లేక విభేదిస్తుందా? అనేది స్పష్టం చేయాలని అమరావతి మహిళలు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్