సాధారణంగా నేరాలు చేసిన వాళ్లు కాస్త భయపడుతూ ఉంటారు. లేదా ఏదైనా తప్పు చేసిన వాళ్లలో ఒక రకమైన ఆందోళన ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతల విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. జగన్ రాజకీయ శైలే కాస్త వెరైటీగా ఉంటే నేరాలు చేసిన తర్వాత లేదంటే తప్పులు చేసిన తర్వాత అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు కాస్త భిన్నంగా ఉంటాయి. నువ్వు తప్పు చేశావని ఎవరైనా ఆరోపిస్తే వారిపై మాటలతో ఎదురు దాడి చేయడం లేదంటే తప్పుచేసి దొరికిపోయిన సరే కావాలని మీడియా ముందు హైలెట్ అయ్యే విధంగా మాట్లాడతారు జగన్.
ఆ కామెంట్స్ తో ఆరోపణలు చేసిన వారిని ఆత్మరక్షణలో పడేస్తారు. ఇక అటెన్షన్ మొత్తం తమ వైపుకు తిప్పుకునే విధంగా తాము నిజాయితీపరులు అని చెప్పుకునే విధంగా ఎదురు దాడి చేయడం అనేది వైసీపీ నేతలకు జగన్ అలవాటు చేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే చేస్తున్నాడు. పక్కాగా దొరికిపోయిన సరే ఆధారాలతో పోలీసులు బయటపెట్టిన సరే అసలు తాను ఏ తప్పు చేయలేదని… పోలీసులు తనకు వచ్చి సమాచారం ఇవ్వలేదని తాను థియేటర్లో ఎక్కువసేపు లేనని కొంచెం సేపు ఉండి బయటకు వెళ్లిపోయాను అంటూ కామెంట్స్ చేశాడు.
Also Read : బన్నీ ఎఫెక్ట్.. టాలీవుడ్‌లో కొత్త భయం..!
ఇక తెలంగాణ పోలీసులను పదేపదే బద్నాం చేసే ప్రయత్నం చేయడం కూడా చాలామందిని విస్మయానికి గురి చేసింది. జగన్ తో స్నేహం చేస్తున్న అల్లు అర్జున్ ఇదే పందాలో నడుస్తున్నాడు అనే విషయం జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. తప్పు చేసినట్లు పోలీసులు సాక్షాలతో సహా వీడియోలతో బయటపెడుతుంటే జగన్ మార్క్ కామెంట్స్ అల్లు అర్జున్ చేస్తున్నాడని ఈ ఘటనను గమనిస్తున్న వారు ఆశ్చర్యపోతున్నారు. శనివారం సాయంత్రం అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడమే కాకుండా అసలు తనదేమీ తప్పు లేదని మాట్లాడుతూ తనకు మనశ్శాంతి లేదని తనపై సానుభూతి తెచ్చుకునే విధంగా అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు. మూడేళ్లు కష్టపడి సినిమా తీశానని ఏదో సమాజ సేవ చేసిన విధంగా అల్లు అర్జున్ చెప్పడం షాకింగ్.