Sunday, September 14, 2025 07:51 AM
Sunday, September 14, 2025 07:51 AM
roots

తిరుమల కొండ పై అక్రమాలు ఆగేదెప్పుడు?

తిరుమల కొండపై ఇప్పుడు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. గత అయిదేళ్లుగా అన్ని రూపాల్లో సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు అదే స్పీడ్ ని ప్రభుత్వం మారినా కంటిన్యూ చేయడం చికాకుగా మారింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు తిరుమలలో టికెట్ లు అమ్ముకున్నారని ఆరు టికెట్ లను లక్ష రూపాయలకు అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటివి చాలానే గత అయిదేళ్ళలో జరిగినా బయటకు రాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ సంచలనం రేపుతున్నాయి. తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తిరుమలలో మరో దళారిని పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా పాండిచ్చేరి సీఎం లేఖ పై విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల అధిక ధరకు విక్రయించేందుకు దళారీ ప్లాన్ చేయడం గమనార్హం. తిరుమల టూ టౌన్ పోలీసులు దళారీ బద్మనాభం అలియాస్ భరత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 21 న నెల్లూరుకు చెందిన 5 మంది భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని రూ. 23 వేలు తీసుకున్నాడు బద్మనాభం. విఐపి దర్శనం టికెట్స్ కాకుండా రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇప్పించాడు.

Also Read : సంచలన నిర్ణయం దిశగా లోకేష్

విఐపి దర్శనం టికెట్లు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని నెల్లూరుకు చెందిన భక్తుడు విజయ్ కుమార్ డిమాండ్ చేసాడు. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు బద్మనాభం నిరాకరించడంతో టిటిడి విజిలెన్స్ అధికారులకు విజయ్ కుమార్ ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు భక్తుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తిరుమల టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసారు విజిలెన్స్ అధికారి శంకర్ బాబు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో విజిలెన్స్ అధికారులు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్