ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య పరిస్థితి రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోగా.. ఇరాన్ మాత్రం అమెరికా బెదిరింపులకు తల వంచడం లేదు. ఆదివారం ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులకు దిగింది. ఈ దాడులను ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ ఖండిస్తూ, తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులను “జియోనిస్ట్ శత్రువు” చేసిన ఘోరమైన నేరమని, దానికి శిక్ష పడాల్సిందే అన్నారు.
Also Read : ఎవరికి ఎవరు కనిపించటం లేదు.. జస్ట్ ఆస్కింగ్..!
అమెరికా దురాక్రమణకు బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరించారు. ఆదివారం నాడు ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రం, మరో రెండు ప్రదేశాల పై అమెరికా 30,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను జారవిడిచింది. ఈ దాడులపై ఐఖ్యరాజ్య సమితి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ దాడులను ఖండిస్తూ, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేయడం ప్రమాదకరమైన పరిణామం అని అభివర్ణించారు.
Also Read : సాక్షిగా బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ లో బిజెపి ఎంటర్ అయినట్టే..?
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ తమ రియాక్షన్ కు అమెరికా సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక ఈ దాడి తర్వాత ఇరాన్.. ఇజ్రాయిల్ పై విరుచుకుపడింది. ఇజ్రాయిల్ రాజధానిపై భారీ దాడులకు దిగింది ఇరాన్. ఇక ఈ యుద్ధం కారణంగా ఇరాన్ కంటే ఇజ్రాయిల్ ఎక్కువగా నష్టపోతోంది. ఇరాన్ దాడులను ఎదుర్కోవడం, ప్రతిదాడులను చేయడానికి ఇజ్రాయిల్ కు భారీగా ఖర్చు అవుతోంది.