దేశంలో రాజకీయ పార్టీలకు కొదవలేదు. ఉన్న పార్టీలు మనుగడ కోసం పోరాటం చేస్తుంటే కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకరు నూతన పార్టీలను ఎనౌన్స్ చేస్తూనే ఉంటారు. ప్రధానంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా పనిచేసిన వాళ్ళు రాజకీయాలపై ఈమధ్య కాలంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఘోర ఓటమి తరువాత పార్టీ కూడా మారిపోయారు. ఇక త్వరలోనే వివాదాస్పద ఐపిఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read : రైతు భరోసా మోసాలకు చెక్.. రేవంత్ కీలక అడుగులు…!
దళిత వ్యక్తి కావడంతో అంబేద్కర్ నినాదాన్ని ఎత్తుకొని రాజకీయ పార్టీని స్థాపించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాల్లో సర్వే కూడా చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. సిఐడి చీఫ్ గా వైసిపి హయాంలో అప్పటి సిఎం జగన్ కి ఏకపక్షంగా పనిచేశారని పేరున్న పీవీ సునీల్ కుమార్ ను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని అందరూ ఎదురు చూశారు. ఆయన చేసిన కార్యక్రమాలకు సంబంధించి టిడిపి ప్రభుత్వం నుంచి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని కార్యకర్తలు ఆశపడ్డారు.
Also Read : రెడ్ బుక్ లో పేరున్నా.. కీలక పోస్టింగ్! సీఐ గారి హవా..!
తీరా చూస్తే బిజెపి సహకారంతోనే పీవీ సునీల్ కుమార్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. తాను పెట్టబోయే కొత్త పార్టీని కూటమిలో భాగస్వామ్యం చేసేందుకు సునీల్ కుమార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి పెద్దలు కూడా దీని వెనక ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా పీవీ సునీల్ కుమార్ కు పేరు ఉంది. ఒకటి రెండు సందర్భాల్లో పివి సునీల్ కుమార్ జగన్ నిర్ణయాలని వ్యతిరేకించినా.. దాదాపుగా ఏకపక్షంగా పనిచేసారన్న పేరు మాత్రం గట్టిగా ఉంది. మరి జగన్ సలహాతోనే సునీల్ కుమార్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. మే నెలలో దీనికి సంబంధించి సునీల్ కుమార్ అధికారిక ప్రకటన కూడా చేయవచ్చు అనే కామెంట్స్ వినబడుతున్నాయి.
Also Read : తులసిబాబుపై ప్రేమ.. ఎమ్మెల్యేపై అధిష్టానం సీరియస్…?
కాగా పివి సునీల్ కుమార్ పై ఇప్పటికే మాజీ ఎంపి, ప్రస్తుత ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో సునీల్ కుమార్ పై టిడిపి పెద్దలు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి కూడా మనకి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టి బిజెపి మద్దతుతో కూటమిలో చేరితే.. పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన కూడా టిడిపిలో వ్యక్తం అవుతుంది. అందుకే ఇప్పటివరకు పివి సునీల్ కుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి రాజకీయ వర్గాల్లో చర్చకు కారణం అయిన పివి సునీల్ కుమార్ పార్టీ పెట్టడం నిజం అయితే.. ఏపి రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.