Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

ఒక్క ఫోటోతో షేక్ అవుతున్న టీడీపీ సోషల్ మీడియా

ఒక్క ఫోటోతో టిడిపి సోషల్ మీడియా రగిలిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా టిడిపి నేతల కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన ఇప్పాల రవీంద్రారెడ్డి… మంత్రి లోకేష్ ను కలవడంపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. మంగళవారం ఉదయం సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. అయితే ఈ ఎంఓయూ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరయ్యాడు.

Also Read: చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. జగన్ కోటకు బీటలు..!

ఎంవోయూ మొత్తాన్ని కూడా రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసిన వైనం తెలుసుకుని.. టిడిపి నేతలు షాక్ అయ్యారు. రవీంద్రారెడ్డి హాజరు కావడంపై ఆ తర్వాత సోషల్ మీడియాలో టిడిపి కార్యకర్తలు, నేతలు ఫైరయ్యారు. అంతేకాకుండా గతంలో ఇప్పాల రవీంద్రారెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను కూడా టిడిపి సోషల్ మీడియా బయటకు తీసింది. లోకేష్ ను కలిసేందుకు ఏ విధంగా ఒప్పుకున్నారు అని టిడిపి కార్యకర్తలు నిలదీస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా సీరియస్ అయ్యారట.

Also Read: సుశాంత్ మరణం మిస్టరీనే…?

పేషీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన లోకేష్ పేషీ సిబ్బంది సిస్కో టీంకి ఘాటుగా లేఖ రాసింది. రవీంద్రారెడ్డి తమ పార్టీ నాయకత్వం, నేతలపై పెట్టిన పోస్టులను గురించి లోకేష్ ఓఎస్డి చైతన్య… సిస్కో యాజమాన్యానికి లేఖ రాశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని ఆ లేఖలో కోరారు. అలాగే తాము రాసిన మెయిల్ పై వెంటనే రెస్పాండ్ అవ్వాలని కూడా సిస్కో అధికారులను లోకేష్ పేషీ కోరింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్