Saturday, September 13, 2025 01:00 AM
Saturday, September 13, 2025 01:00 AM
roots

ఎవరు గెలిచినా చరిత్రే.. ఆసక్తిగా ఐపిఎల్ ఫైనల్

ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆ మ్యాచ్ తో తేలిపోనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఫైనల్ లో ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశ నుంచి అద్భుత ప్రదర్శన చేసిన ఈ రెండు జట్లు.. ప్లే ఆఫ్స్ లో కూడా అదే స్థాయిలో ఆధిపత్యం చెలాయించాయి. క్వాలిఫయర్ వన్ లో పంజాబ్ తడబడినా.. నిన్నటి మ్యాచ్ లో మాత్రం ముంబైపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐపిఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన జట్టుగా పంజాబ్ కు పేరుంది.

Also Read : అయ్యర్ క్లాస్ హిట్టింగ్.. ప్యూర్ టెక్నిక్

అయితే ఈ ఏడాది వేలంలో.. జట్టు యాజమాన్యం శ్రేయాస్ అయ్యర్ ను భారీ ధరకు కొనడం, కెప్టెన్ గా అతని ప్రదర్శన, బ్యాటర్ గా అతని దూకుడు పంజాబ్ జట్టును ఫైనల్ కు చేర్చాయి. అటు ఆర్సీబీ కూడా ఈ ఏడాది వేలంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు.. లీగ్ దశ నుంచి దూకుడుగా ఆడింది. ఇక ఈ రెండు జట్లు గత 18 ఏళ్ళ ఐపిఎల్ సీజన్ లో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. ఆర్సీబీ నాలుగు సార్లు ఫైనల్ కు వెళ్ళగా పంజాబ్ ఒక్కసారే వెళ్ళింది.

Also Read : ఎందుకు ఈ మౌనం.. సాక్షి తప్పుడు ప్రచారంపై సైలెంట్ గా కూటమి

రెండు జట్లు భీకర ఫాం లో ఉండటంతో ఫైనల్ ఏ రేంజ్ లో ఉంటుందా అనే ఆసక్తి పెరిగిపోయింది. ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండింట్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే.. బ్యాటింగ్ లో కాస్త వీక్ గా కనపడినా.. నిన్నటి మ్యాచ్ తో ఆ డౌట్ ను క్లియర్ చేసింది. బౌలింగ్ విభాగంలో అర్శదీప్ సింగ్, యన్సేన్ తో పాటుగా జేమిసన్, చాహల్ మంచి ఫాంలో ఉన్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ను ఎంత వరకు కట్టడి చేస్తారో చూడాలి. ఏది ఎలా.. రెండు జట్లలో ఏది గెలిచినా.. ఐపిఎల్ లో సరికొత్త చరిత్ర లిఖించినట్లే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్