Friday, September 12, 2025 05:21 PM
Friday, September 12, 2025 05:21 PM
roots

దువ్వాడ కుటుంబ వ్యవహారంలో మరో కీలక ట్విస్ట్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వివాహేతర సంబంధంలో ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 60 ఏళ్ళ వయసులో ఆయన అక్రమ సంబంధం వ్యవహారంతో రోడ్డుకి ఎక్కారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో 9 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. తమ తండ్రి తమను ఇంట్లోకి అనుమతించే వరకు తాము వెనక్కు తగ్గేది లేదని ఆయన కుమార్తెలు స్పష్టంగా చెప్తున్నారు. ఇక ఆయన భార్య దువ్వాడ వాణీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు.

ఈ వ్యవహారంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన పంచాయితీ చేయాల్సింది పోయి సమస్యను తీవ్రతరం చేసారని కామెంట్స్ వినపడుతున్నాయి. వీరి కుటుంబ పంచాయితీ ఇప్పటికే మాజీ సీఎం జగన్ వద్దకు చేరగా, ఇరువురితో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇదిలా సాగుతున్న తరుణంలో దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురి కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పలాస మండలం లక్ష్మీoపురం టోల్గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీ కొట్టారు ఆమె.

Also Read : ప్రభుత్వం మారినా ఏపీలో ఆగని ఇసుక దందా..?

ఆ వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇక ఆస్పత్రిలో ఆమె మాట్లాడిన మాటలు ఆశ్చర్యపరుస్తున్నాయి. తనకు వైద్య చికిత్స అందించవద్దు అని తాను చనిపోవాలి అనుకుంటున్నాను అంటూ ఆమె కామెంట్స్ చేసారు. వాణి తనను వేధిస్తున్నారు అందుకే తాను చనిపోవాలి అనుకుంటున్నా అంటూ మీడియాకు వెల్లడించారు. తన పిల్లలు కూడా రోడ్డున పడ్డారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. దీనితో ఇప్పుడు ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె మాట్లాడిన మాటల ప్రకారం ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరం. దీనితో ఆమెపై కేసు నమోదు చేసినట్లు, మరియు ఉద్దేశపూర్వకంగా మరో కారుని ఢీ కొట్టి వారిని గాయాలపాలు చేయడం నేరం కావడంతో మరోకేసు నమోదు చేసినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్