జనగణనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం రెండు దశల్లో ఈ జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో 2026 అక్టోబర్ నెలలో ప్రారంభించి 2027 ఫిబ్రవరి చివరి నాటికి లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇక రెండో విడతలో 2027 మార్చి ఒకటిన మొదలు పెట్టనున్నట్లు గెజిట్‌లో స్పష్టం చేశారు. రెండో విడతలో జనగణనతో పాటు కుల గణన కూడా నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనగణన నిర్వహించడం ఇది 8వ సారి. దీనిపై ఇప్పటికే కేంద్ర హోం శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరు ఈ జనగణనకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read :ఇంటింటికీ తొలి అడుగు.. పడుతుందా..?
జనగణన ప్రారంభమవుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జనగణన తర్వాత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు ఉంటుందనే విషయం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్. అటు పార్లమెంట్ స్థానాలతో పాటు ఇటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయని రాజకీయ పార్టీల నేతలు బలంగా నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పెంపు ఉంటుందని అప్పట్లో కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిని ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు.
Also Read : ఇంగ్లాండ్‌లో తెలుగోడికి ఛాన్స్ కష్టమే
వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. 2011లో చివరిసారిగా జనాభా లెక్కించారు. ప్రతి పదేళ్లకు ఓసారి దేశ జనాభా లెక్కించడం ఆనవాయితీ. అయితే కోవిడ్ కారణంగా జనగణనకు బ్రేక్ పడింది. ఆ రెండేళ్ల సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు మృత్యువాత పడ్డారు. కరోనా విలయతాండవం కారణంగా లెక్కింపును కేంద్రం వాయిదా వేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన నిర్వహించాలని తీర్మానం చేయడంతో.. కేంద్రం కూడా దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన కూడా నిర్వహించాలని భావించింది. ఈ ప్రక్రియను 2027 చివరి నాటికి పూర్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
Also Read : మోడీ వైజాగ్ టూర్.. బిజీ బిజీగా చంద్రబాబు
జనగణన జరిగితే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలు పెరుగుతాయనే మాట తెలుగు రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తోంది. కులగణన ప్రాతిపదికన రిజర్వుడు నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కలిసి మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఇందులో ఏపీలో 175, తెలంగాణలో 119 స్థానాలున్నాయి. అలాగే ఏపీలో 25 లోక్‌సభ స్థానాలుంటే.. తెలంగాణలో 17 స్థానాలున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్‌విభజన జరిగినప్పటికీ సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో నేతలు తమ తమ నియోజకవర్గాలు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read : వైసీపీలో ఊపు వస్తుందా.. సాధ్యమేనా..?
అయితే జనగణన ప్రారంభం అవుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పరోక్షంగా పలుమార్లు ప్రస్తావించారు. దీంతో నియోజకవర్గాల పెంపు ఖాయమని నేతలంతా భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ల హవా క్రమంగా తగ్గుతోంది. అన్ని పార్టీలు కూడా కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు కూడా అవకాశం వస్తుందని నేతలంతా ఆశిస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు జనాభా లెక్కింపు దోహదపడుతుందని అధికారులు కూడా స్పష్టం చేశారు.




