మా లక్ష్యం గెలుపు.. యుద్ధంలో అయినా సరే.. మైదానంలో అయినా సరే.. పాకిస్తాన్‌ను ఓడించటమే మా టార్గెట్.. ఇదే విషయాన్ని భారత జట్టు తెగేసి చెప్పింది. పిరికిపందల మాదిరిగా మ్యాచ్ ఆడేది లేదని హోటల్‌లో కూర్చోలేదు. జరిమానా కట్టలేదు. మ్యాచ్ రిఫరీని తొలగించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. రిఫరీ ఆండీని తొలగించకపోతే యూఏఈతో మ్యాచ్ ఆడేది లేదన్నారు. అయితే పీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ రెండుసార్లు తిరస్కరించింది. మ్యాచ్ ఆడకపోతే.. భారీ జరిమానా కట్టాలని వార్నింగ్ ఇచ్చింది.
Also Read : బీఎస్ఎన్ఎల్ సరికొత్త అడుగు.. భారత్ నూతన అధ్యాయం..!
కానీ భారత్ అలా కాదు.. తటస్థ వేదిక మీద ఆడేందుకు సిద్ధమని ముందే చెప్పింది. చెప్పినట్లుగా మ్యాచ్ ఆడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడు మ్యాచ్‌లలో టీమిండియా జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది. పాక్ క్రీడాకారులు మైదానంలో చేసిన రచ్చకు స్టేడియంలోనే సమాధానం చెప్పారు భారత్ ప్లేయర్లు. పహల్గామ్ దాడుల గురించి పాక్ ప్లేయర్లు పదే పదే సైగలు చేస్తుంటే.. భారత్ ఆటగాళ్లు ఏ మాత్రం సహనం కోల్పోలేదు. నేరుగా బంతితోనే జవాబిచ్చారు. సూపర్ 4 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాక్ బౌలర్ హరీస్ రవుఫ్ ఆపరేషన్ సిందూర్ గురించి వ్యంగ్యంగా సైగలు చేశాడు. దానికి బూమ్రా ఫైనల్ మ్యాచ్‌లో జవాబు చెప్పాడు. రవుఫ్‌ను బౌల్డ్ చేసిన బూమ్రా.. నీ రాకెట్ కూలిపోయింది.. అంటూ నవ్వుతూ సైగ చేశాడు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక గెలిచిన తర్వాత ట్రోఫీ అందుకునేందుకు భారత్ జట్టు ముందుకు రాలేదు. ఇందుకు ఏకైక కారణం.. పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవటమే. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీతుగా ట్రోఫీ తీసుకోవటం మాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్పారు. ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండా టీమిండియా ఆటగాళ్లు దూరంగా ఉండిపోయారు. దీంతో ట్రోఫీని భారత్ నిరాకరించినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. పీసీబీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నఖ్వీ .. పాకిస్తాన్ మంత్రి కూడా. అందుకే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు.
Also Read : మిడిల్ ఆర్డర్ లో తెలుగు ఛాంపియన్.. తిలక్ సూపర్ హిట్
భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మాకు కావాల్సింది ట్రోఫీ కాదు.. గెలుపు అని చెప్పకనే బదులిచ్చారు. భారత జట్టుకు మొత్తం 21 కోట్ల ప్రైజ్ మనీ అందింది. వాస్తవానికి ఆసియా కప్ ముందు ఎన్నో అనుమానాలు. అసలు భారత్ – పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానం. ఇక ఇదే అంశంపై పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏమిటని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో ప్రశ్నించారు కూడా. మరికొందరైతే.. దుబాయ్ వేదికపై జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడితే.. పరువు పోతుంది కదా.. పహల్గామ్ దాడిలో మృతులకు ఇదేనా ఇచ్చే విలువ అని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు కూడా చేశారు. కానీ బీసీసీఐ మాత్రం.. మెన్ ఇన్ బ్లూ బాయ్స్ మీద నమ్మకంతో మ్యాచ్ ఆడేందుకు ఓకే చెప్పింది. వరుసగా 7 మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా 9వ సారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీకి ఇస్తున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు.