Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

ముంబై దాడుల మాదిరిగానే ప్లాన్.. పహల్గాం ఘటనపై సంచలన విషయాలు

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. అసలు ఉగ్రవాదులు ఏ మార్గం నుంచి వచ్చారు, వారికి రూట్ మ్యాప్ ఎవరు ఇచ్చారు అనే దానిపై దర్యాప్తు సంస్థలు కూపీ లాగే పనిలో పడ్డాయి. తాజాగా వచ్చిన వివరాల ప్రకారం.. డిజిటల్ మూలాలు అన్నీ పాకిస్తాన్ కేంద్రంగానే ఉన్నట్టు గుర్తించారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదుల డిజిటల్ మూలాలు పాకిస్తాన్ లోని ముజఫరాబాద్, కరాచీలోని సేఫ్‌హౌస్‌లలో భారత నిఘా సంస్థలు గుర్తించాయని సమాచారం.

Also Read : ఉగ్రదాడి మాస్టర్ మైండ్ వాడే.. లీడర్ ఎవడంటే..?

ఈ దాడులలో పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ భావిస్తోంది. 26/11 ముంబై దాడులలో ఉపయోగించిన రిమోట్ కంట్రోల్-రూమ్ మాదిరిగానే రిమోట్ కంట్రోల్-రూమ్‌ను ఉపయోగించారని దర్యాప్తులో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉన్నత స్థాయి అధికారులు వెల్లడించారు. ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ, ప్రాణాలతో బయటపడిన వారి వాంగ్మూలాల ప్రకారం, హత్యలలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో భారత్ లోకి చొరబడ్డారు. AK రైఫిల్స్, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలు వంటి ఆటోమేటిక్ ఆయుధాలు కలిగి ఉన్నారని అధికారులు వెల్లడించారు.

Also Read : హైదరాబాద్ నిలుస్తుందా.. ఆ ఇద్దరిపైనే వదిలేస్తుందా..?

వారిలో కొందరు సైనిక తరహా దుస్తులు కూడా ధరించారని తెలిపారు. తమకు ఉన్న నిఘా సమాచారం ప్రకారం పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద కార్యకర్తలతో వారికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఓ అధికారి జాతీయ మీడియాకు వెల్లడించారు. ముజఫరాబాద్, కరాచీలోని కొన్ని సేఫ్‌హౌస్‌లకు సంబంధించిన డిజిటల్ మూలాలను తాము గుర్తించామని వెల్లడించారు. ఇవి భారత్ లో లష్కరే తోయిబా జరిపిన.. గతంలో జరిపిన దాడులకు కేంద్రాలుగా ఉన్నాయని, వీటిని పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ.. కంట్రోల్ సెంటర్ల నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు అని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్