Friday, September 12, 2025 03:16 PM
Friday, September 12, 2025 03:16 PM
roots

కర్నూలులో ఇండియన్ ఆర్మీ సంచలన ప్రయోగం..!

సరిహద్దు దేశాల నుంచి వచ్చే ఏ ముప్పును అయినా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను తయారు చేస్తోంది. క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. ఇటీవల లడఖ్ లో ఆకాష్ ప్రైమ్ క్షిపణిని ప్రయోగించిన భారత్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరో క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. టెస్ట్ రేంజ్‌లో డ్రోన్-లాంచ్డ్ ప్రెసిషన్-గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కర్నూలులో యూఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది.

Also Read : అనంతబాబుకు సహకరించింది ఎవరు..? సిట్ విచారణలో సంచలనాలు..!

ఈ విషయాన్నీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి డీఆర్డీఓను అభినందించారు. భారత క్షిపణి సామర్ధ్యానికి ఇదో బలమైన ప్రోత్సాహం అన్నారు ఆయన. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ యొక్క టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ అభివృద్ధి చేసింది. దీనిలో మల్టీ వార్ హెడ్ లు ఉన్నాయని ఆర్మీ తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేసామని పేర్కొంది. ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ సీకర్లు, డ్యూయల్-థ్రస్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లు వంటి వాటిని ఇందులో పొందుపరిచారు.

Also Read : ఎన్టీఆర్ పై బాలీవుడ్ జనాల కుళ్ళు.. ఆల్ఫా మేల్ కాదంటూ కామెంట్

ఇవి తేలికగా ఉండటమే కాకుండా, సుదూర ప్రాంత లక్ష్యాలను చేధిస్తాయని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. కర్నూలో ఈ ప్రయోగాన్ని నిర్వహించడం వెనుక బలమైన కారణం ఉంది. కర్నూలులో హైటెక్ టెస్టింగ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఫిక్సిడ్ వింగ్ లతో పాటుగా స్వార్మ్ డ్రోన్ లను అడ్డుకునే వ్యవస్థలు ఉండటంతోనే.. ఇక్కడి నుంచి ప్రయోగించారు. ఇటీవల హై-ఎనర్జీ లేజర్-ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ను కూడా ఇక్కడ విజయవంతంగా ప్రయోగించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్