Saturday, October 18, 2025 09:13 PM
Saturday, October 18, 2025 09:13 PM
roots

ఆపరేషన్ సిందూర్ లెక్కలు బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – వర్సెస్ పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు యుద్ధం దిశగా వెళ్ళిన సంగతి తెలిసిందే. పాక్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ఆ దేశ సైన్యం కూడా ప్రతిస్పందించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. భారత్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంలో పాక్ ఫెయిల్ అయినా సరే ఆ దేశ మీడియా మాత్రం తామే విజయం సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేసింది. దీనికి భారత రక్షణ శాఖ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది.

Also Read : మిధున్ రెడ్డిని రౌండప్ చేసిన సిట్..!

ఇక తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం ఆసక్తికర కామెంట్స్ చేసారు. పాక్ ఘోరంగా ఫెయిల్ అయిందని.. అయినా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానిస్తూ.. భారత సైన్యం మూడు హ్యాంగర్లు, నాలుగు రాడార్లతో సహా 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని వెల్లడించారు. భారత సైన్యం 1 C-130 విమానాలను, ఒక ఎయిర్‌ బోర్న్ ఎర్లీ వార్నింగ్, విమానాన్ని, నాలుగు నుండి ఐదు ఫైటర్ జెట్‌ లను కూడా ధ్వంసం చేసిందని వెల్లడించారు.

Also Read : అంచనాలను అందుకోలేని తెలుగు కుర్రాడు..?

న్యూఢిల్లీలో జరిగిన ఐక్యరాజ్య సమితి దళాల సహకార దేశాల చీఫ్స్ కాన్క్లేవ్‌ లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. 300 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన గ్రౌండ్ టు ఎయిర్ కిల్ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. పాకిస్తాన్ కు ప్రతిస్పందించే టైం ఇవ్వలేదని పేర్కొన్నారు. వాళ్ళు ప్రయోగించిన డ్రోన్ లు, రాకెట్ లు, క్షిపణులు అన్నీ ఫెయిల్ అయ్యాయని అన్నారు. ఎనిమిది వైమానిక స్థావరాలను భారత ఆర్మీ టార్గెట్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ కు ఏ క్షణంలో అయినా బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్...

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా...

పోల్స్