పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సరిహద్దు భద్రతపై మరింత ఫోకస్ పెట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పెద్ద ఎత్తున చొరబాట్లు కావడంతో కాశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇటీవల భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ కు కూడా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున చొరబాట్లకు ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ, అక్కడి ఉగ్రవాదులపై ఏ క్షణంలో అయినా దాడి చేసేందుకు భారత్ సిద్దంగా ఉందని ఇటీవల పలువురు ఆర్మీ అధికారులు కామెంట్ చేస్తూ వస్తున్నారు.
Also Read : మాకు ఈ పెళ్లిళ్లు వద్దు బాబోయ్..!
ఈ తరుణంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనీల్ చౌహాన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు యుద్ధంలో రన్నరప్‌లు ఉండరని, ఏ సైన్యం అయినా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడైనా కార్య రంగంలోకి దూకేందుకు సిద్దంగా ఉండాలని కామెంట్ చేసారు. ఒక ఉదాహరణ చెప్తూ.. ఆపరేషన్ సిందూర్, ఇప్పటికీ కొనసాగుతోంది అన్నారు. మనం వేగంగా స్పందించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలన్నారు. 24×7, 365 రోజులు సిద్దంగా ఉంటేనే ఫలితాలు వస్తాయని కామెంట్ చేసారు. భారత్ ఉగ్రవాదుల విషయంలో కఠినంగా ఉందని పేర్కొన్నారు.
Also Read : ఫ్రీలాన్స్ వీసా ఆఫర్ చేస్తోన్న జర్మనీ.. రూల్స్ ఇవే..!
కాగా మే 7న భారత ఆర్మీ.. ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున దాడులకు దిగింది. అటు పాకిస్తాన్ కూడా భారత్ కు సమాధానం ఇచ్చే దిశగా దాడులకు దిగింది. దీనితో రెండు దేశాల మధ్య యుద్ధం ఖాయమని భావించారు. ఈ తరుణంలో అమెరికా ఎంటర్ కావడంతో సీన్ మళ్ళీ మొదటికి వచ్చింది. మే 10 కి ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు దేశాలతో చర్చలు జరిపారు. భారత కాలమానం ప్రకారం అదే రోజు సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపాయి.