Friday, August 29, 2025 08:27 PM
Friday, August 29, 2025 08:27 PM
roots

ఇండియా టుడే బీహార్ మూడ్ చేంజ్ చేస్తుందా..?

బీహార్ ఎన్నికల్లో ఎన్డియే గెలవడం అనేది ఆ కూటమి కంటే బిజెపికి అత్యంత ముఖ్యం. కేంద్రంలో 2024 లో అత్యంత క్లిష్ట పరిస్థితిలో ప్రధాని అయిన మోడీ.. బీహార్ సిఎం నితీష్ కుమార్ పై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకవేళ ఈ ఎన్నికల్లో ఎన్డియే ఓడిపోతే మాత్రం ఆ పార్టీకి పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండవచ్చు అనేది రాజకీయ వర్గాల మాట. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీహార్ లో గట్టిగా ఫోకస్ చేసింది. రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు.

Also Read : అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్..!

ఆర్జెడి నేతలు కూడా గత ఏడాది నుంచి క్షేత్ర స్థాయిలో ఫోకస్ చేసారు. ఇక కేంద్రంలో కూడా బిజెపికి కాస్త ఇబ్బందికర వాతావరణమే ఉంది. విదేశాంగ విధానం బిజెపిని ఇబ్బంది పెడుతోంది. ఓటు చోరీ వ్యవహారం కూడా తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో ప్రముఖ జాతీయ మీడియా న్యూస్ ఛానల్ ఇండియా టుడే బయటపెట్టిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. బీహార్ లో ఎన్డియే కూటమికి బిగ్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు బీహార్ లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఎన్డియేకి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పింది.

Also Read : ఎన్టీఆర్ విత్ నీల్.. మరో ఇద్దరు స్టార్ హీరోలు.. ?

అలాగే దేశంలో మరోసారి మోడీ గాలి వీస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే ఇప్పుడు బీహార్ లో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఇండియా టుడే హిందీ వెర్షన్.. ఆజ్ తక్ వీడియో లను బిజెపి వైరల్ చేస్తోంది. కాంగ్రెస్ ఓటు చోరీ అంశంపై బీహార్ లో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో.. బయటపెట్టిన ఈ సర్వే.. ఈ ఏడాది చివర్లో జరగబోయే బీహార్ ఎన్నికల్లో కీలకంగా మారడం ఖాయంగా కనపడుతోంది. బీహార్ లో 48 శాతం ఓటర్లు ఎన్డియేకి మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే వెల్లడించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్