Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

ఈ వ్యూహం ఏంటీ కోచ్ సాబ్…?

భారత్ లో భారత్ టెస్ట్ సీరీస్ లో పరువు కోసం పాకులాడటం ఆశ్చర్యం గానే ఉంది. అగ్రశ్రేణి జట్లను స్పిన్ మాయాజాలంతో మడతేసి మూడు రోజులకే మ్యాచ్ లను ముగించిన టీం ఇండియా ఇప్పుడు మూడు రోజులకే న్యూజిలాండ్ స్పిన్ మాయాజాలానికి బోల్తాపడటం ఆశ్చర్యమే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లను కూడా భారత్… చాలా వ్యూహాత్మకంగా ఎదుర్కొనేది. కాని కివీస్ చేతిలో గెలవాల్సిన మ్యాచ్ లను చేజార్చుకోవడం విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడు మూడో టెస్ట్ లో పరువు కోసం పోరాడుతోంది.

అదంతా ఓకే గాని… మూడో టెస్ట్ లో తొలి రోజు టీం ఇండియా చేసిన ఓ తప్పుతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. జైస్వాల్ వికెట్ పడిన తర్వాత నైట్ వాచ్మెన్ గా సిరాజ్ ను పంపారు. సిరాజ్… అజాజ్ పటేల్ బౌలింగ్ లో తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూ క్లియర్ గా తెలిసినా దానికి రివ్యూ తీసుకున్నాడు. అసలు సిరాజ్ రివ్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. అతనేం టాప్ బ్యాటర్ కాదు. అతను ఒకవేళ నాట్ అవుట్ అయినా క్రీజ్ లో నిలబడే అంత సీన్ ఉన్న బ్యాట్స్మెన్ కాదు. కాని అక్కడ రివ్యూ వృధా అయిపొయింది.

Also Read : 3 లక్షల మందితో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్

టెస్ట్ లో రివ్యూ తీసుకుంటే దానికో విలువ ఉండాలి. దీనికంటే ముందు… అసలు అతన్ని నైట్ వాచ్మెన్ గా పంపడం కామెడి. అశ్విన్ ఉన్నాడు, అతని కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసే ఆకాష్ దీప్ ఉన్నాడు. కానీ అతన్ని పంపించడం విస్మయానికి గురి చేసింది. అసలు అతన్ని పంపకుండా అశ్విన్ ని పంపి ఉంటే కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చి ఉండేవాడు కాదు. సిరాజ్ బ్యాటింగ్ చేసినా ఉపయోగం లేదు. ఫలితంగా సిరాజ్ ను పంపడంతో కోహ్లీ వికెట్ వృధా అయిపోయింది. దీనిపై ఇప్పుడు గంభీర్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్