Saturday, September 13, 2025 03:25 AM
Saturday, September 13, 2025 03:25 AM
roots

దిగ్గజాలు గౌరవంగా తప్పుకుంటే మంచిదా..?

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ… ఇండియన్ క్రికెట్ టీంకు దాదాపు 15 ఏళ్ళ నుంచి వెన్నెముకగా నిలిచిన ఆటగాళ్ళు. టాప్ ఆర్డర్ లో వీళ్ళు ఇద్దరూ ఆడితే చాలు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ళు చాలా ధీమాగా ఉండేవాళ్ళు. వీళ్ళ నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చింది అంటే మ్యాచ్ మనదే. చేజింగ్ లో కోహ్లి కింగ్ అయితే… ప్రత్యర్ధులకు చెమటలు పట్టే టార్గెట్ ఫిక్స్ చేయడంలో రోహిత్ దిట్ట. అలాంటి దిగ్గజాలు ఇప్పుడు బోల్తా పడుతున్నారు. పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఒకప్పుడు ఈ ఇద్దరి ఆట చూడటానికే మైదానానికి వచ్చే అభిమానులు ఇప్పుడు వీళ్ళ పేరు వింటే ఫైర్ అవుతున్నారు.

న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్ట్ ల సీరీస్ లో ఓటమి బాధ్యత ఈ ఇద్దరిదే. ఖచ్చితంగా ఈ ఇద్దరిదే… జట్టుకు అవసరమైనప్పుడు కీలక పరుగులు చేసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టడంలో ఈ ఇద్దరూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అలవోకగా గెలిచే మ్యాచ్ లను బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించారు. దీనితో ఈ ఇద్దరూ గౌరవంగా తప్పుకుంటే మంచిది అనే డిమాండ్ లు వినపడుతున్నాయి. ఆస్ట్రేలియా సీరీస్ లో వీళ్ళ అనుభవం చాలా కీలకం. ఆస్ట్రేలియా మైదానాలపై ఇద్దరికీ చాలా అనుభవం ఉంది. అక్కడ వీళ్ళు రాణించాలి.

Also Read : మూడో చాప్టర్ లో ఉన్న నాయకులు వీళ్లేనా…?

లేదంటే మాత్రం ఘోర ఓటమితో టీం తిరిగి రావాల్సి ఉంటుంది. టి20 ప్రపంచ కప్ గెలుపు కన్నా న్యూజిలాండ్ తో సీరీస్ ఓటమి ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ఈ సీరీస్ గెలిచి ఉంటే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు ఇబ్బంది ఉండేది కాదు. కాని టీం ఇండియా గెలవలేదు. సీనియర్లు గా ఇప్పుడు జట్టుని ముందు ఉండి నడిపించాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉంది. వీళ్ళు ఇద్దరూ ఆడితేనే యువ ఆటగాళ్ళపై భారం తగ్గుతుంది. మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ ఆట ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇదే వైఖరి కొనసాగితే మాత్రం ఉన్న పరువు పోగొట్టుకున్నట్టే. ఈ సీరీస్ లో ఆరు ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోవడం అంటే.. అతని ఆట ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్