సిడ్నీలో జరగబోయే చివరి టెస్ట్ విషయంలో ఇప్పుడు టీం ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ జట్టు కూర్పు విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. గెలవాల్సిన నాలుగో టెస్ట్ లో జట్టు ఓటమిపై గంభీర్ ఇప్పుడు సీరియస్ గా కనపడుతున్నాడు. కనీసం డ్రా అయినా అయ్యే ఛాన్స్ ఉందని అందరూ భావించారు. కాని అనూహ్యంగా ఓడిపోవడంతో తుది జట్టులో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నాడు. సీనియర్ ఆటగాడు రిషబ్ పంత్ ను తుది జట్టు నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నాడు. అతని స్థానంలో యువ ఆటగాడు జురెల్ ను తీసుకోనున్నారు.
Also Read : చిల్లర ప్రవర్తన.. మరోసారి ప్రూవ్ చేసుకున్న ఆసిస్
అలాగే ఆకాష్ దీప స్థానంలో యువ బౌలర్ ప్రసిద్ కృష్ణను తుది జట్టులోకి తీసుకోవాలని గంభీర్ భావిస్తున్నాడు. నలుగురు పేసర్లతో భారత్ బరిలోకి దిగే ఛాన్స్ కనపడుతోంది. బౌలింగ్ లో రాణించకపోయినా బ్యాటింగ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న.. నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో ఏ ఇబ్బంది లేదు. సిరాజ్ ను ముందు పక్కన పెట్టె ఛాన్స్ ఉందని అందరూ భావించారు. కాని అతన్ని జట్టులో కంటిన్యూ చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడానికి గంభీర్ సిద్దమయ్యాడు.
Also Read : ఏపీలో గేమ్ చేంజ్ చేయనున్న పవన్ కళ్యాణ్
కెఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఓపెనర్ గా వచ్చినప్పుడు మూడు టెస్టుల్లో రెండు టెస్టుల్లో రాహుల్ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. అందుకే అతన్ని ఓపెనర్ గానే కొనసాగించాలని భావిస్తున్నారు. పంత్ విషయంలోనే జట్టు యాజమాన్యం సీరియస్ గా ఉంది. గెలవాల్సిన మ్యాచ్ లో అతని ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుందర్ లేదా జడేజాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. జడేజాను దాదాపుగా పక్కన పెట్టి అతని స్థానంలో హర్షిత్ రానాను తీసుకునే ఛాన్స్ ఉంది.