Tuesday, October 28, 2025 07:31 AM
Tuesday, October 28, 2025 07:31 AM
roots

గిల్ సిద్ధం.. రాహుల్ ప్లేస్ ఫైనల్ అయినట్టే..?

మొదటి టెస్ట్ విజయంతో మంచి జోష్ మీదున్న భారత జట్టు ఇప్పుడు రెండో టెస్ట్ పై సీరియస్ గా ఫోకస్ చేసింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఎదుర్కోవడం అంటే అంత ఈజీ కాదు. కానీ భారత్ తొలి టెస్ట్ లో చాంపియన్ ఆట తీరుతో ఆసిస్ జట్టుకు చుక్కలు చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత జట్టు చాలా అత్యున్నత స్థాయి ప్రదర్శన చేసింది. ఇక రెండో టెస్ట్ జట్టు కూర్పుపై భారత జట్టు యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది. ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి అనే దానిపై అర్ధం కాని పరిస్థితిలో ఉంది.

Also Read : తెగని ‘మహా’ పంచాయతీ..!

మొదటి టెస్ట్ కు యువ ఆటగాడు శుభమన్ గిల్ గాయంతో దూరమయ్యాడు. మూడో స్థానంలో గిల్ చాలా కీలక ఆటగాడు. అటు ఓపెనర్లను ఇటు మిడిల్ ఆర్డర్ ను సమన్వయం చేసుకుని భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్ధ్యం ఉన్న ఆటగాడు. మొదటి టెస్ట్ కు గిల్ అందుబాటులో లేకపోవడంతో పడిక్కల్ ను తీసుకొచ్చారు. పడిక్కల్ పర్వాలేదు అనిపించినా భారీ ఇన్నింగ్స్ మాత్రం అతని నుంచి రాలేదు. ఇప్పుడు గిల్ చేతి వేలి గాయం పూర్తిగా తగ్గింది. దీనితో రెండో టెస్ట్ కు గిల్ ఆడతాడు. ముందు గిల్ రాకపోతే కెఎల్ రాహుల్ ను మూడో స్థానానికి పంపే ఆలోచన చేసారు.

Also Read : కొడుకు కోసం మెట్టు దిగుతున్న కాపు నేత…!

రోహిత్ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పుడు గిల్ రావడంతో… అతన్ని అయిదో స్థానంలో పంపి జురెల్ ను పక్కన పెట్టె ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ అత్యంత కీలకం కావడంతో ఇప్పుడు భారత జట్టు హెడ్ కోచ్ గంభీర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. రోహిత్ ను అయిదో స్థానంలో పంపాలి అనే డిమాండ్ కూడా ఇప్పుడు వినపడుతోంది. మరి ఐదు టెస్టుల ఈ సీరీస్ లో విజయం సాధించాలి అంటే ఒక్క మ్యాచ్ లో కూడా పట్టు విడవకూడదు. ఈ సీరీస్ గెలిస్తే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అవకాశాలు బాగుంటాయి కూడా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్