Tuesday, October 28, 2025 02:29 AM
Tuesday, October 28, 2025 02:29 AM
roots

రాజధానిలో బాహుబలి బ్రిడ్జ్..!

రాజధాని అమరావతి వెళ్లాలనుకుంటున్నారా.. అసలు రాజధానికి వెళ్లాలంటే సరైన మార్గం ఉందా.. ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. అదే కృష్ణానదిపై బాహుబరి బ్రిడ్జి. అమరావతికే ఇది ఓ మణిహారం. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే అతి పొడవైన వంతెనగా రికార్టుల్లోకి ఎక్కింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 3 కిలోమీటర్ల పొడవైన మెగా వంతెన నిర్మించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెడుతూనే.. రాష్ట్ర రాజధాని అమరావతిని ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేసేందుకు ఇది ఎంతో సహకరిస్తుంది.

Also Read : యుద్ధం ఆపుతా.. ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్

భవిష్యత్తులో కోటి జనాభా అవసరాలకు అనుగుణంగా అమరావతి నగరాన్ని నిర్మిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి నగరాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే అమరావతి నగరానికి అనుకుని ఉన్న కృష్ణా నదిపై భారీ వంతెనను ప్రభుత్వం నిర్మించింది. చెన్నై – కొల్‌కతా జాతీయ రహదారి విజయవాడ నగరంలో నుంచే వెళ్తోంది. ప్రస్తుతం విజయవాడ నగరం మీదుగానే పెద్ద పెద్ద వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీని వల్ల విజయవాడలో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి చెక్ పెట్టందుకు అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మించారు. గన్నవరం మండలం చిన అవుటపల్ల నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రోడ్ నిర్మిస్తున్నారు. ఈ బైపాస్‌కు అనుసంధానం చేస్తూ.. కాజా టోల్ గేట్ నుంచి గొల్లపూడి వరకు 17 కిలోమీటర్ల బైపాస్ ఇప్పటికే పూర్తైంది. ఈ మార్గంలో భాగంగా అమరావతిలోని వెంకటపాలెం నుంచి గొల్లపూడి వరకు కృష్ణా నదిపై 3.1 కిలోమీటర్ల పొడవైన బాహుబలి వంతెన నిర్మించారు. మొత్తం 15 వందల 46 కోట్ల రూపాయలతో 17 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మించారు. కృష్ణా నదిపై 6 వరుసల వంతెనఇప్పుడు అమరావతిని ప్రజలకు మరింత దగ్గర చేసింది.

Also Read : లిక్కర్ లో ఇరుక్కున్న మరో ఐపిఎస్.. చార్జ్ షీట్ లో సంచలనాలు

అమరావతికి బూస్టింగ్ ఇచ్చేలా దేశంలోని ప్రధాన జాతీయ రహదారులతో ఈ బ్రిడ్జ్ కనెక్టివిటీ పెంచుతోంది. విజయవాడ బైపాస్ ప్యాకేజ్ -4లో భాగంగా ఈ మెగా వంతెన నిర్మించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి ఈ వంతెన ఎంతో మేలు చేస్తుంది. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు.. విజయవాడ నగరంలోకి రాకుండానే అమరావతి చేరుకోవచ్చు. అమరావతి నిర్మాణ పనులు రీ స్టార్ట్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సమయంలో ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వంతెన నిర్మాణం వల్ల అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన భారీ వాహనాలు, నిర్మాణ సామాగ్రి రవాణా కూడా చాలా సులభం అవుతుంది. ప్రమాదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 6 వరుసల మార్గంతో పాటు బైకులు, ఆటోల కోసం కూడా చిన్న మార్గం ఏర్పాటు చేశారు. రాజధానిలోని సచివాలయం, హైకోర్టు, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారికి ఈ వంతెన ఓ వరంలా మారనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్