తెలంగాణ పోలీసులు అతి పెద్ద సినిమా పైరసీ రాకెట్‌ను పట్టుకున్నారు. ఈ ముఠాను పట్టుకోవడానికి సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నామని గొప్పగా వెల్లడించారు. అలాగే త్వరలోనే ఐ బొమ్మ నిర్వాహకులను కూడా పట్టుకున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి గతంలోనే ఐ బొమ్మ నిర్వాహకులు టాలీవుడ్‌తో పాటు పోలీసులకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి బహిరంగ లేఖ విడుదల చేసి పోలీసులతో పాటు టాలీవుడ్ పెద్దలకు కూడా సవాల్ విసిరారు.
“ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా.. మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.
Also read : గంజా బ్యాచ్ కు చుక్కలే.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల స్పీడ్
1. హీరోలకు అంత రెమ్యూనరేన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా..
2. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లు ఏం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్లకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్‌కి వస్తాయా..?
3. సినిమా బడ్దెట్‌లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాల్లో షూటింగ్‌లకు ట్రిప్స్‌కు ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు..? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా. అక్కడ వాళ్లకు ఉపాధి కలుగుతుంది కదా.
4. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ అమౌంట్‌ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్య తరగతి వాడే బాధపడుతున్నాడు.
మా వెబ్ సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి.. లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.
ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్ సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐ బొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ-సిగరెట్ కు యూజర్స్‌ను మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కు నా రియాక్షన్ ఉంటుంది.
Also read : అమెరికా షట్ డౌన్.. ప్రమాదంలో వారి ఉద్యోగాలు..!
ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా (ఉదాహరణ – విజయ్) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్ సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్లు ఉంటుంది. అందుకే ఈ పోస్టు చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నాం.
ఐ బొమ్మ వాళ్లు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్లని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాం. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వాళ్లంత మంచి వాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి.
మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తాం. చావుకు భయపడని వాడు.. దేనికి భయపడడు.” అంటూ ఐ బొమ్మ నిర్వాహకులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సినిమా రెమ్యూనరేషన్ దగ్గర నుంచి.. బాయ్స్ ఖర్చు వరకు ప్రస్తావించడంతో ఫిలిం నగర్‌లో పెద్ద దుమారం రేపుతోంది. నిజమే కదా అంటున్నారు. ఓటీటీలో వచ్చిన తర్వాతే కదా ఐ బొమ్మలో పెడుతున్నారు. మరి కెమెరా ప్రింట్స్ తీసే వాళ్లను ఎందుకు వదిలిపెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఐ బొమ్మ నిర్వాహకుల లేఖ.. అటు పోలీసులకు, ఇటు టాలీవుడ్ పెద్దలకు పెద్ద సవాల్‌గా మారింది.