ఏపీలో ఎన్డియే సర్కార్ అధికారంలోకి వస్తే తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తా అంటూ చెప్పుకుంటూ వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వం మారిన వెంటనే 13 ఏళ్ళు సర్వీస్ ఉన్నా సరే విధుల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ సర్వీసు కోసం ప్రవీణ్ ప్రకాష్ ఆరాట పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జగన్ హయాంలో అన్నీ తానై వ్యవహరించారు బీహార్ కు చెందిన ప్రవీణ్ ప్రకాష్. ఆయన వీఆర్ఎస్ తీసుకుంటూ లేఖ రాసిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఆలస్యం చేయకుండా ఆమోదించింది.

అయితే ఇటీవల ప్రవీణ్ ప్రకాష్, మళ్ళీ ప్రభుత్వానికి, ధరఖాస్తు చేస్తూ, తానుస్వచ్ఛంద పదవి విరమణ ధరఖాస్తు చేసేటప్పుడు, తన మైండ్ బాగా లేదని, పొరపాటుగా స్వచ్ఛంద పదవి విరమణకు ధరఖాస్తు పెట్టానని, ప్రభుత్వం కూడా ఆమోదించందని, మళ్ళీ తనని సర్వీస్ లోకి తీసుకోవాలని కోరారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే మంత్రి లోకేష్ తయారు చేసిన రెడ్ బుక్ లో ప్రవీణ్ ప్రకాష్ పేరు ఉన్న సంగతి తెలిసిందే.

అలాంటి ప్రవీణ్ ప్రకాష్… లోకేష్ ను కూడా కలిసారని సమాచారం. అయితే దీనిపై ఎంత వరకు అవకాశాలు ఉన్నాయి అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఒకసారి స్వచ్ఛంద పదవి విరమణకు ఆల్ ఇండియా సర్వీసు అధికారులు గాని ఇతర ఉద్యోగులుగాని నిర్ణయం తీసుకుని దరఖాస్తు చేసిన తర్వాత… ప్రభుత్వం ఆమోదం తెలిపాక, మళ్ళీ సర్వీస్ లోకి తీసుకునే అధికారం ముఖ్యమంత్రి కు ఉంటుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఇప్పటికే కొందరు అధికారుల విషయంలో సీరియస్ గా ఉన్న చంద్రబాబు… మరి ప్రవీణ్ ప్రకాష్ ను ఏం చేస్తారనేది చూడాలి.