Monday, October 27, 2025 08:56 PM
Monday, October 27, 2025 08:56 PM
roots

మాట నెగ్గించుకున్న అమ్రాపాలి

ఈ రోజుల్లో కొందరు ఐఏఎస్ అధికారులు.. సినిమా హీరోల మాదిరి ఫేమస్ అవ్వడమే కాదు.. ప్రభుత్వాలు, న్యాయ స్థానాల నిర్ణయాలను కూడా మార్చుకోవడంలో సంచలనాలు సైతం సృష్టిస్తున్నారు. తమకు నచ్చిన చోట డ్యూటీ చేయడానికి ఎంత వరకు అయినా వెళ్లేందుకు ఐఏఎస్ అధికారులు వెనకడుగు వేయడం లేదు. ఈ విషయంలో యువ ఐఏఎస్ అధికారిణి అమ్రాపాలి కాటా ముందు వరుసలో ఉంటారు. తాను అనుకున్నది సాధించే విషయంలో ఈమె గారి పట్టుదల ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read : ఆ బాధ్యత మీదే.. మంత్రులకు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్, సుప్రీం కోర్ట్ లు ఇచ్చిన ఆదేశాల తర్వాత కూడా ఆమె తన మాట నెగ్గించుకునే దిశగా అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించింది తాజాగా. అసలేం జరిగింది అంటే ఏడాది క్రితం ఏపీ, తెలంగాణ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనం అయింది. ఆ వెంటనే సదరు అధికారులు సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళారు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. వెంటనే వారిని కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేయాలని న్యాయస్థానం కూడా స్పష్టంగా చెప్పింది.

Also Read : జగన్ కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో.. వారిలో ఒకరైన అమ్రాపాలి రిపోర్ట్ చేసారు. కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటతో పాటుగా.. రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీలో విధులలో జాయిన్ అయ్యారు. తాజాగా మళ్లీ ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆమ్రపాలి కాట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు మరోసారి ఆమెకు అవే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్