తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా చుక్కలు చూపిస్తోంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా అందరి ఆక్రమణల మీద దృష్టి పెట్టి గట్టిగా కొడుతోంది. హైదరాబాద్ ను వరద ముంపు నుంచి బయటకు తీసుకు రావడమే లక్ష్యంగా పని చేస్తోంది హైడ్రా. దీనికి సామాన్య ప్రజల నుంచి మద్దతు కూడా భారీగా వస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా గట్టిగానే మద్దతు వస్తోంది. అందుకే హైడ్రాను పూర్తి స్థాయిలో బలోపేతం చేసారు కేబినేట్ లో. చట్టబద్దత కల్పించడమే కాకుండా… హైడ్రాకు భారీగా సిబ్బందిని, మెషీనరీని కూడా కేటాయించారు.
దీని వెనుక ప్లాన్ ఏంటీ అనేది ఇప్పుడు అక్రమాలు చేసిన వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంశం. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న హైడ్రా… ఇప్పుడు తన పని తాను మొదలుపెట్టింది. నిన్న ఏకకాలంలో నాలుగు చోట్ల కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఇంకొక బిగ్ ప్లాన్ రెడీ చేసుకుంది అనే టాక్ వస్తోంది. ఇన్ని రోజులు సైలెంట్ గా చూసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఓవైసీలకు చెందిన భవనాలను కూల్చేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంది. త్వరలోనే ఈ కూల్చివేతలు భారీగా ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీలోని కీలక నేత భవనం మీద కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టడం కొందరిని భయపెడుతోంది.
Read Also : చేతులెత్తేసిన వైసీపీ సోషల్ మీడియా.. కారణం ఇదేనా?
త్వరలోనే ఆ కాంగ్రెస్ నాయకుడి భవనం కూడా నేలమట్టం చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. హైడ్రా చీఫ్ రంగనాథ్ కు ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ కూడా ఇచ్చేసారు ఆ భవనం విషయంలో. దీనితో ఏం జరగబోతుంది అనే కంగారు కాంగ్రెస్ నేతల్లో కూడా ఉంది. బీఆర్ఎస్ నేతలు తమ భవనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నా అవి సాధ్యం కావడం లేదు. మరి హైడ్రా తర్వాతి టార్గెట్ ఏంటీ అనేది స్పష్టత లేదు గాని… కేబినేట్ లో ఫుల్ పవర్స్ వచ్చిన దగ్గరి నుంచి మాత్రం దూకుడు పెంచింది.