మెగా ఫ్యామిలీ నుంచి ఒక మంచి మల్టీ స్టారర్ సినిమా రావాలని ఫాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో ఆరేళ్ళ క్రితం టి. సుబ్బిరామి రెడ్డి దీనిపై ఒక ప్రకటన కూడా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించి త్రివిక్రమ్ ఒక కథ కూడా సిద్దం చేస్తున్నాడని, ఇందుకోసం మాటల మాంత్రికుడు భారీగా డిమాండ్ చేసాడని కూడా టాలీవుడ్ వర్గాలు అన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరోసారి చర్చ మొదలయింది. పవన్ కళ్యాణ్ తో పాటుగా చిరంజీవి కూడా సిద్దంగా ఉన్నారని త్వరలోనే ఆయన కథ కూడా వింటారని సినీ వర్గాలు అంటున్నాయి.
అయితే ఆ కథ వినేది త్రివిక్రమ్ దగ్గర కాదని హరీష్ శంకర్ వద్దని సమాచారం. హరీష్ శంకర్ దీనిపై తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ దర్శకుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ సిద్దం చేసి పెట్టానని త్వరలోనే దానిని పవన్ కళ్యాణ్ కు వినిపిస్తానని అన్నారు. ఇది గనుక సెట్స్ పైకి వెళ్తే మాత్రం భారీ మల్టీ స్టారర్ అవుతుందని అన్నారు హరీష్ శంకర్. ఆ లైన్ ఏంటీ అనేది ఇప్పుడు ఫాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది.
అప్పట్లో త్రివిక్రమ్ తో మల్టీ స్టారర్ ను ఎలా అయినా ప్లాన్ చేయాలని సుబ్బిరామి రెడ్డి పట్టుదలగా వెళ్ళారు. అందుకోసం ఆయన ఏకంగా 150 కోట్ల బడ్జెట్ కూడా సిద్దం చేసుకున్నారు. అవసరమైతే మరో 50 కోట్ల రూపాయలను తాను ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నాను చెప్పారు. కాని అప్పుడు చిరంజీవి, పవన్ ఇద్దరూ దానిపై ముందుకు వెళ్ళే సాహసం చేయలేదు. త్రివిక్రమ్ కూడా కథ మీద దృష్టి పెట్టలేదు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఒకవేళ ఈ మల్టీ స్టార్రర్ సినిమా పట్టాలెక్కితే మాత్రం ఒక సంచలనమే అని చెప్పుకోవాలి.




