Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ఖరారైతే తిరుగులేదు

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైందని ప్రభుత్వం తెలిపింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్.. రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దశల వారీగా రూ.95 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దేశంలో ఇప్పటికే మూడు (ముంబయి, కొచ్చి, మధ్యప్రదేశ్లోని బినాల్లో) రిఫైనరీలను ఏర్పాటు చేసిన బీపీసీఎల్ నాలుగోది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్నారు.

Also Read : ఇంఛార్జుల మార్పు.. క్యాడర్‌లో అసంతృప్తి..!

6,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి సమావేశం ఆమోదముద్ర వేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)కి మంగళవారం రాసిన లేఖలో సంస్థ ఈ విషయం బయటపెట్టింది. ‘సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్ క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్- 2015లోని 30వ నిబంధన ప్రకారం తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. బీపీసీఎల్ ప్రాజెక్టు కోసం సుమారు 5 వేల ఎకరాలు అవసరమని సంస్థ ప్రతిపాదనలు పంపింది.

Also Read :మిస్టర్ జగన్ రెడ్డీ….నోరు అదుపులో పెట్టుకో : ఏబీ వెంకటేశ్వరరావు

భూసేకరణకు సుమారు 1,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసారు. ముందస్తు కార్యకలాపాలకు ప్రతిపాదించిన.6,100 కోట్లలో భూసేకరణ ఖర్చు పోనూ.. మిగిలిన 4,600 కోట్లను ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు లక్ష మందికి ఉపాధి కల్పిస్తారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 5 వేల మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఏర్పాటుపై బీపీసీఎల్ తో త్వరలో ఒప్పందం జరగనుంది. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ ప్రస్తుతం తనకున్న మూడు రిఫైనరీల ద్వారా ఏటా ప్రపంచంలోని ఆరు ఖండాల నుంచి వచ్చే 96 రకాల చమురును దాదాపు 40 మిలియన్ టన్నుల మేర శుద్ధి చేయనున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్