Friday, September 12, 2025 03:09 PM
Friday, September 12, 2025 03:09 PM
roots

టీపీసీసీ చీఫ్‌కు తొలి సమస్య… ఎలా డీల్‌ చేస్తారో మరి?

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఎందుకు అయ్యారు? ఆమెను కష్టాలు ఎందుకు చుట్టు ముడుతున్నాయి? మహిళా మంత్రిపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? పార్టీకి కొండా సురేఖ ఎందుకు గుదిబండగా మారారా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌. కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖను వివాదాలు చుట్టుముడుతున్నాయి. నెల రోజుల కింద పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీన్ని అప్పట్లో ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఆతర్వాత కొన్ని రోజులకే మంత్రి సీతక్క, కొండా సురేఖ మధ్య కోల్డ్ వార్ అంటూ వార్తలు వచ్చాయి. దాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య హీరో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ పెద్ద బాంబు పేల్చారు. సమంతా, నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల వేములవాడ ఆలయ సందర్శన సందర్భంగా స్వామి వారికి నైవేద్యం ఆలస్యం కావడానికి మంత్రి కొండా సురేఖ కారణమంటూ సోషల్ మీడియాలలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇక తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి సురేఖపై తిరుగుబాటు మొదలు పెట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌తోపాటు పార్టీ ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీకి కూడా ఫిర్యాదు చేయడంతో మంత్రి కొండా సురేఖ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొన్ని రోజులుగా మంత్రి సురేఖ వ్యవహారంపై దాదాపు ప్రతి సందర్భంలోనూ రేవూరి అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా దసరా సందర్భంగా ఫ్లెక్సీలతో వచ్చిన గొడవ వల్ల ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో రేవూరితో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఆమెపై టీపీసీసీ నేతతో పాటు ఢిల్లీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు మంత్రిపై తిరుగుబాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ, ధర్మారం ప్రాంతాల్లో మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య పలు సందర్భాల్లో గొడవలు జరిగాయి. దీంతో మంత్రి, ఎమ్మెల్యే మధ్య పంచాయతీ పీక్స్‌కి చేరింది.

Also Read : రేవంత్ ఏ పార్టీ…? బీఆర్‌ఎస్‌కు కొత్త దిగులు..!

మరోవైపు.. మాజీమంత్రి కడియం శ్రీహరి, కొండా సురేఖ మధ్య కొన్నేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది.. కడియం శ్రీహరి టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఉంది. వర్దన్నపేటతో పాటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో కొండా అనుచరుల ప్రాభల్యం పెరుగుతోందట. వీరంతా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారని పార్టీలో చర్చ మొదలైంది. దీంతో మంత్రి సురేఖతో తమకు ఎప్పటికైనా ఇబ్బంది తప్పదని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు భావించి ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మరో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా ఇదే వాదనను తమ సన్నిహితుల వద్ద చెపుతున్నారని సమాచారం.

తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో మంత్రి అనుచరులు అధికారులను బెదిరిస్తున్నారని, తమ నియోజకవర్గంలో మంత్రికి ఏం పని అని గండ్ర ప్రశ్నిస్తున్నారు. ఇక ఎర్రబెల్లి స్వర్ణ, కొండా ఫ్యామిలీ మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అలెర్ట్ అయ్యారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. కేవలం కార్యకర్తల అత్యుత్సాహంతోనే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని, వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం చూపిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి లొల్లి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోందని కాంగ్రెస్‌ భావిస్తోంది. వరంగల్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయడమో, లేదా తానే వరంగల్ వెళ్లి మీటింగ్ పెట్టడం ద్వారానో ఈ సమస్యను పరిష్కరించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిర్ణయించినట్లు సమాచారం. మరి.. పీసీసీ చీఫ్‌గా ఎదుర్కోబోతున్న తొలి సమస్యను ఎలా డీల్ చేస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్