ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ మధ్య అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రమే దీని గురించి ప్రచారం జరిగినా ఇప్పుడు మాత్రం టీడీపీ బహిర్గతం చేసిన కొన్ని లేఖలతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. వైఎస్ షర్మిల విషయంలో జగన్ వెనక్కు తగ్గకపోవడమే కాకుండా ఇప్పుడు కొన్ని విషయాల్లో దూకుడుగా వెళ్తున్నారు. షర్మిలను ఇబ్బంది పెట్టేందుకు జగన్ కేసులు ఫైల్ చేసారు. త్వరలోనే మరిన్ని పిటీషన్ లు ఆయన దాఖలు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
Also Read: షర్మిలతో పోరాటం అంటే.. జగన్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా?
ఈ తరుణంలో వైసీపీ నేతలతో జగన్ చేయిస్తున్న వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా పేర్ని నానీ, వైవీ సుబ్బారెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కుట్రలో షర్మిల పావుగా మారింది అంటూ ఆయన ఆరోపించారు. హైకోర్టు స్టేటస్ కో ఉన్నా.. షేర్లను బదిలీ చేశారని… షేర్లను బదలాయించారు కాబట్టే.. జగన్ NCLTని ఆశ్రయించారని ఆయన తెలిపారు. వాస్తవాలు చెప్పేందుకు NCLTని జగన్ ఆశ్రయించారన్నారు.
Also Read: బిగ్ బ్రేకింగ్: అమ్మకే బ్రతుకుపై అసహ్యం కలిగించారు
తల్లి, చెల్లిపై కేసులు వేయాలనే దురుద్దేశం జగన్‌కు లేదని… NCLTలో పిటిషన్ వేయకపోతే.. మళ్లీ టీడీపీ నేతలే జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేస్తారని జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేసారు. ముగ్గురు ఇదే వ్యాఖ్యలు చేయడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. అసలు షర్మిల ఆస్తులు అడగడానికి… జగన్ బెయిల్ రద్దు కావడం వెనుక కారణం ఏంటీ, ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: బీద ఏడుపులు ఏడవకు జగన్..!
అసలు కుటుంబ సమస్యకు వైసీపీ నేతలతో మాట్లాడించడం ఏంటీ అని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఆస్తులకు సంబంధించి లేఖలు బయట పెడుతున్న సమయంలో… టీడీపీకి షర్మిల పంపారని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపై కూడా షర్మిల బహిరంగ లేఖలో కౌంటర్ ఇచ్చారు. సాధ్యం అయితే జగన్ సమాధానం చెప్పాలి గాని… వైవీ సుబ్బారెడ్డికి పేర్ని నానీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు అందరూ ఒకటే మాటలు మాట్లాడటం వెనుక… అందరికి ఒకటే స్పీచ్ పంపారని ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు.




