గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక అడుగులు పడుతున్నాయి. తాజాగా.. మూడు రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలు జారీ చేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్. వెన్నుపూస నొప్పి కారణంగా ఇబ్బంది పెడుతున్నానంటూ పిటిషన్ పై స్పందించిన కోర్టు.. బెడ్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్ట్. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలని ఆదేశించింది. విజయవాడ లిమిట్స్ లోనే కస్టడీలోకి తీసుకొని విచారించారంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్ట్.
Also Read : సభలో 11 నిమిషాలు… చివరికి బాయ్‌కాట్..!
న్యాయవాది సమక్షంలోనే విచారించాలని స్పష్టం చేసింది. ఇక వల్లభనేని వంశీకి పిటి వారెంట్ జారీ చేసింది సిఐడీ కోర్ట్. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పిటి వారెంట్ జారీ చేసారు. రేపు వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు సీఐడీ పోలీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వంశీ బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది హై కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణల కేసులో ఇప్పటికే జిల్లా జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు వంశీ. రేపటితో వంశీకి ఎస్సి ఎస్టీల కేసుల ప్రత్యేక న్యాయస్థానం విధించిన రిమాండ్ ముగుస్తోంది.
Also Read : ఆ ఇద్దరిలో ఎవరికి ముందు.. ఎవరికి ప్రాధాన్యత..?
రేపు కోర్టు ఆదేశాలతో వంశీని సీఐడీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు. కేసులో ముగ్గురు నిందితులు అయిన అది లక్ష్మి(ఏ28),శివ కుమార్(ఏ27),నీలం ప్రవీణ్ కుమార్.(ఏ 54) అరెస్టు చేసారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ ను ఎస్సి,ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. బెయిల్ పిటిషన్ డిస్ మిస్ చేయడంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.