Friday, September 12, 2025 02:59 PM
Friday, September 12, 2025 02:59 PM
roots

రోగులు ఏటీఎంలు కాదు.. హైకోర్ట్ సంచలన కామెంట్స్

ఈ రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల దందా గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్ట్ లు, వైద్యం, రూమ్స్, మందులు.. ఇలా ఏ మార్గంలో అవకాశం ఉంటే ఆ మార్గంలో దోచుకోవడంలో వెనుకడుగు వేయరు. కార్పోరేట్ ఆస్పత్రుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల వరకు ఇదే సినిమా నడుస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే శవాల మీద పేలాలు వేరుకుంటున్నారు అనే తిట్లు వచ్చినా వారి వైఖరిలో మాత్రం మార్పు ఉండదు. వారి విషయంలో ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.

Also Read : డీ లిమిటేషన్ పై సుప్రీం సంచలన కామెంట్స్..!

ఈ తరుణంలో అలహాబాద్ హైకోర్ట్ ప్రైవేట్ ఆస్పత్రుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. గర్భిణీ స్త్రీ మరణంపై దాఖలు అయిన పిటీషన్ పై విచారణ చేసిన హైకోర్ట్.. రోగులను ఏటీఎంలుగా చూస్తున్నారని మండిపడింది. కేసు విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు తగినంత వైద్యులు లేదా మౌలిక సదుపాయాలు లేనప్పటికీ రోగులను చికిత్స కోసం ప్రలోభపెట్టడం సాధారణ అలవాటుగా మార్చుకున్నారని అసహనం వ్యక్తం చేసారు.

Also Read : కర్నూలులో ఇండియన్ ఆర్మీ సంచలన ప్రయోగం..!

రోగుల నుండి డబ్బు వసూలు చేయడానికి మాత్రమే ఆస్పత్రులు ఉన్నాయన్న ఆయన, ఏటీఎంల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఓ నర్సింగ్ హోం యజమాని హైకోర్ట్ లో తనపై క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని పిటీషన్ దాఖలు చేసాడు. అనస్థీషియాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణీ స్త్రీ ప్రసవం ఆలస్యం కావడం, ఆమె మరణంతో పోలీసులు కేసు నమోదు చేసారు. కోర్టు ఆ పిటిషన్‌ ను తోసిపుచ్చుతూ వైద్య నిపుణులకు రక్షణ కల్పించాలని, కానీ సరైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేదా వైద్యులు లేకుండా నర్సింగ్‌ హోమ్‌లను నడుపుతున్న వారికి రక్షణ కల్పించకూడదని, రోగులను దోచుకోవడానికి రక్షణ కల్పించాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్