Friday, September 12, 2025 06:41 PM
Friday, September 12, 2025 06:41 PM
roots

ఇటలీలో రేసింగ్ ప్రమాదం.. మరోసారి సురక్షితంగా బయటపడ్డ హీరో అజిత్

దక్షిణ భారత సినీ ప్రేక్షకుల అభిమాన హీరో అజిత్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటలీలో నిర్వహించిన కార్ రేసింగ్ సమయంలో అజిత్ కుమార్ పాల్గొన్న కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై అభిమానులు ఎంతో ఆందోళనకు లోనయ్యారు. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కార్ రేసింగ్ లో అజిత్ ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. అజిత్ కారు ఇంతకు ముందు రెండు సార్లు ఇలాంటి ప్రమాదాలకు గురైంది. ఈసారి కూడా అజిత్ సురక్షితంగా బయటపడటం అభిమానులకు ఊరట కలిగించే విషయం.

Also Read : ఒక్క కామెంట్‌తో ఇండియాను ఫిదా చేసిన లోకేష్

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో వ్యాఖ్యాత అజిత్ పట్టుదల, కృషి గురించి వివరిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.. “అజిత్ కుమార్ ఇప్పుడు కార్ బయటకు వచ్చారు, రేస్ నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది ఇదే అతనికి పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. కానీ ఆయన గొప్ప క్రీడాకారుడు. ప్రమాదం తర్వాత కూడా అక్కడ సిబ్బందికి కార్ శిధిలాలను తొలగించడంలో సహాయం చేస్తున్నారు. చాలా మంది డ్రైవర్లు అలా చేయరు.” వీడియోలో అజిత్ కారు నిలిచిపోయిన మరో కారును ఢీకొట్టిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. రెండు కార్లూ తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ, అజిత్ సురక్షితంగా బయటపడటమే విశేషం.

Also Read : అప్పుడు బ్రతుకు మీద ఆశ కోల్పోయాను.. అమీర్ సంచలన వ్యాఖ్యలు

అజిత్ కుమార్ సినిమా రంగంలో ఎంతమందిని ప్రభావితం చేశారో, మోటార్ స్పోర్ట్స్‌లో కూడా అంతే ఆత్మీయతతో కొనసాగుతున్నారు. ఆయనకు చిన్ననాటి నుంచి రేసింగ్‌పై అపారమైన ఆసక్తి ఉంది. సినిమాల మధ్యలో కూడా రేసింగ్ ట్రాక్లపై తన ప్రతిభను నిరూపించుకుంటూ ఉంటారు. అజిత్ తమిళనాడు రాష్ట్ర రేసింగ్ కార్ అసోసియేషన్‌లో సభ్యుడిగా కూడా ఉన్నారు. 2010లో ఫార్ములా 2 చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ద్వారా తన మోటార్ స్పోర్ట్స్ అభిరుచిని ప్రపంచానికి తెలియజేశారు. సినిమా నటుడిగా మాత్రమే కాకుండా, నిజమైన క్రీడాకారుడిగా, సమర్ధుడైన డ్రైవర్‌గా తనను తాను నిరూపించుకున్న అజిత్‌కి, ఇటలీ ప్రమాదం అనంతరం సోషల్ మీడియాలో వస్తున్న అభినందనలు ఆయన స్పోర్ట్స్‌పైన ఉన్న కమిట్మెంట్‌కు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అతని సహనానికి, స్పోర్ట్స్‌మన్‌షిప్‌కి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్