“నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. నా దెబ్బ ఎలా ఉంటుందో మా ఆయనను అడుగు చెబుతాడు..” అనేది జులాయి సినిమాలో నటి హేమ డైలాగ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో చక్రం తిప్పుతున్న నటి హేమ.. నిజ జీవితంలో కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ క్షణక్షణం సినిమాలో శ్రీదేవితో కలిసి నటించిన హేమ.. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 500కు పైగా సినిమాల్లో నటించారు. టాలీవుడ్‌లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. హేమ ఉంటే.. సీన్ పండినట్లే అనేది దర్శక నిర్మాతల మాట. ఇండస్ట్రీలో ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న హేమ… ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు.
Also Read : విడదల రజనీ జైలుకే.. కోర్ట్ ముందు సాక్ష్యాలు
సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం ఓ కుదుపు కుదిపేస్తోంది. డ్రగ్స్ ఎక్కడ దొరికినా.. దాని లింక్ మాత్రం సినీ ఇండస్ట్రీ వైపు చూపిస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక సెలబ్రెటీ పేరు వినిపిస్తూనే ఉంది. డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికాయి. అయితే ఈ పార్టీలో ప్రముఖ నటి హేమ ఉన్నారని… ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు వెలువడ్డాయి. అయితే అదే రోజు హేమ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. తాను తన ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్నా అంటూ వీడియోలో స్పష్టం చేశారు. తనకు డ్రగ్స్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం హేమను అదుపులోకి తీసుకుని విచారించారు. పరిశ్రమ పెద్దలు కూడా ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టడం.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. “మా” కూడా హేమపై వేటు వేయడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగింది.
Also Read : తెలుగు వైపు చూస్తున్న మరో బాలీవుడ్ స్టార్
ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన హేమకు బెంగళూరు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసు కొట్టివేయాలంటూ నటి హేమ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్‌లో హేమ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు హైకోర్టు.. హేమ దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్‌ను అనుమతిస్తూ.. విచారణ జరిగిన న్యాయస్థానం స్టే ఇచ్చింది. దాదాపు ఏడాదిన్నర పాటు సైలెంట్‌గా ఉన్న హేమ.. కోర్టు స్టే విధించడంతో ఒక్కసారిగా తానేమిటో చూపించారు. తనపై అసత్య ప్రచారం చేశారంటూ పలువులు టాలీవుడ్ ప్రముఖలకు, యూట్యూబ్ ఛానల్స్ కు లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించారని… తన ప్రతిష్ఠను దిగజార్చారంటూ కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రిలకు కూడా నోటీసులు పంపించారు. వీటిపై సరైన వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధమంటూ నోటీసులో హేమ స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. ఇప్పటికీ హేమ అని నెట్‌లో టైప్ చేస్తే.. తన సినిమాలకు బదులుగా.. తనపై చేసిన తప్పుడు ఆరోపణల వీడియోలే వస్తున్నాయని వాపోయారు. దీని వల్ల తనకు సినిమాల అవకాశాలు రావడం లేదని.. తన పరువుకు భంగం కలిగించారంటూ నోటీసులో వెల్లడించారు. నటి హేమ ఇచ్చిన నోటీసులు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి.