Monday, October 20, 2025 12:53 PM
Monday, October 20, 2025 12:53 PM
roots

బరువు కంట్రోల్‌లో ఉంచే ఫైబర్‌ రిచ్ ఫుడ్స్‌ తీసుకోవడానికి.. 4 చిట్కాలు..!

మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యమైన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. ఆరోగ్యంగా తినడం అంత కష్టమైన విషయం కాదు. మీరు చేయాల్సిందల్లా మీ ఆహార ప్రాధాన్యతల పట్ల అప్రమత్తంగా ఉండటం, సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. మనలో చాలామంది మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడానికి శ్రద్ధ వహిస్తుంటారు. అయితే.. మన జీర్ణవ్యవస్థకు మద్దతునిచ్చే, బరువును కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడే ఫైబర్‌ను విస్మరిస్తూ ఉంటారు. మనం ఫైబర్‌ను జీర్ణించుకోలేం.. మన ఆహారంలోని ఫైబర్‌ పేగుల ద్వారా పెద్దపేగుల్లోకి వెళ్తుంది, మన పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మీరు డైట్‌ ఫైబర్‌ను సమృద్ధిగా తీసుకోవడానికి కొన్ని సింపుల్‌ టిప్స్‌ సహాయపడతాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం శాకాహారంతోనే లభిస్తుంది. ఇందులో రకరకాలు ఉండొచ్చు గానీ ప్రధానమైనవి నీటిలో కరిగేది, నీటిలో కరగనిది. ఫైబర్స్ గట్ మైక్రోబయోటాను మీడియేట్‌ చేస్తుంది, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూవారీ ప్రతిపాదించిన ఫైబర్‌ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్‌ రిచ్‌ డైట్‌ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఫైబర్‌ రిచ్‌ డైట్‌ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. నీటిలో కరగని ఫైబర్‌ . లివర్‌ నుంచి పేగుల్లోకి వచ్చే కొలెస్ట్రాల్‌ను ఇది పట్టేసుకుంటుంది.

మీ డైట్‌లో ఫైబర్‌ సమృద్ధిగా తీసుకోవడానికి.. ఆహారంలో తృణధాన్యాలు చేర్చండి. . అనారోగ్యకరమైన పాస్తా, వైట్‌ బ్రెడ్‌ వంటి ప్రాసెస్‌ చేసిన ధాన్యాలకు బదులుగా తృణధాన్యాలు తీసుకోండి. బ్రౌన్‌ రైస్‌, క్వినోవా, హోల్‌ వీట్‌ పాస్తా, ఓట్‌ వంటి తృణధాన్యాల్లో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇవి మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచడమే కాకుండా.. మీ జీర్ణక్రియ సున్నితంగా చేయడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు మీరు బరువు తగ్గాడానికి సహాయపడతాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్