తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుందా, 2009 తర్వాత పదవులకు దూరంగా ఉన్న రాధకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టిన తర్వాత గత రెండు ఎన్నికల్లో కూడా రెండు నియోజకవర్గాల నుంచి రాధ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కాని ఆయన మాత్రం పోటీకి దిగలేదు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓ స్థానం గుంటూరు జిల్లా నుంచి ఓ స్థానంలో ఆయనకు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చాయి.
అయితే టీడీపీ తరుపున తన స్థాయిలో కష్టపడిన రాధ… ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. ఇటీవల గుండెపోటు కూడా ఆయనను ఇబ్బంది పెట్టింది. ఇటీవలే వివాహం చేసుకున్న రాధ అలా గుండెపోటుకు గురి కావడం పట్ల అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పుడు ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. రాధకు శాసన మండలిలో అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇటీవల రాధను పరామర్శించడానికి ఆయన నివాసానికి వెళ్ళిన మంత్రి లోకేష్ ఇదే విషయం చెప్పినట్టు సమాచారం.
Also Read : బిగ్ బ్రేకింగ్: అమ్మకే బ్రతుకుపై అసహ్యం కలిగించారు
ఇటీవల శాసన మండలి నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానాలు ఖాళీ కావడంతో వాటి నుంచి రాధను మండలికి పంపాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా ఉండవచ్చు. అవసరమైతే ఎమ్మెల్సీ పదవితో పాటుగా ఆయనకు మరో కీలక పదవి కూడా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం మొదలయింది. వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన రాధ… పార్టీ అధిష్టానానికి విధేయుడుగా ఉండటంతోనే ఆయనకు పదవి దక్కుతోంది అంటున్నారు పరిశీలకులు.