ఎమ్మెల్సీ కవిత వివాదం భారతీయ రాష్ట్ర సమితిలో పెద్ద దుమారం రేపుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌కు తనను దూరం చేస్తున్నారంటూ కవిత బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక పార్టీలో పరిస్థితులపైన, తనపై జరుగుతున్న కుట్రలపైన కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ కూడా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. తన అన్న కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా కవిత వ్యాఖ్యలు చేసినట్లు తేలిపోయింది. దీనిపై కేటీఆర్ కూడా తనదైన శైలిలోనే బదులిచ్చారు. పార్టీ అధినేతకు ఎవరైనా లేఖలు రాయవచ్చని.. అయితే పార్టీపైన బహిరంగ విమర్శలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య వివాదానికి కారణమయ్యాయి.
Also Read : ఉక్రెయిన్ మాస్టర్ మైండ్.. ఒక్క అటాక్ తో రష్యాకు షాక్.. అమెరికాకు వార్నింగ్
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అన్న కేటీఆర్‌పై కవిత పరోక్ష యుద్ధం ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ ఉంటుందని బహిరంగంగానే వ్యాఖ్యానించిన కవిత.. తన అన్న కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన అవసరం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుతున్న నేతలంతా.. కేసీఆర్‌కు కాళేశ్వరం నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు కూడా. అలాగే కేసీఆర్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేసేందుకు కూడా కవిత నిర్ణయించారు.
ఇక కొత్త పార్టీ ఆలోచన తనకు లేదని కవిత స్పష్టం చేశారు. అదే సమయంలో తన తండ్రిని, పార్టీని కాపాడుకోవటమే తన ఏకైక లక్ష్యమన్నారు. తన సంస్థ జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు ఫోకస్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించారు కవిత. కవిత వ్యవహారంపై ఆచి తూచి వ్యవహరిస్తున్నారు కేసీఆర్. అందుకే కవిత అంశంపై ఎవరూ స్పందించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక గొడవ ప్రారంభమైన తర్వాత నుంచి పార్టీలో విభేదాలు రావడంతో.. ఎందుకు వచ్చిన గొడవ అన్నట్లుగా కేటీఆర్ అమెరికా వెళ్లిపోయారు. కవిత అంశంపై పార్టీ ముఖ్యనేతలో పాటు హరీష్ రావుతో కూడా కేసీఆర్ చర్చించారు.
Also Read : మళ్ళీ యాక్టివ్ అవుతున్న సజ్జల.. వైసీపీ సోషల్ మీడియా రియాక్షన్స్ అదుర్స్
కవిత పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు హరీష్ బ్రేక్ వేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కవిత ఇప్పటికే చాలా సార్లు ఆరోపించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలకు హరీష్ జవాబిచ్చారు. బీఆర్ఎస్‌కకు ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఏ ఎన్నిక అయినా సరే.. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. అలాగే కేసీఆర్ నాయకత్వంోనే తాము పనిచేస్తామని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో కేటీఆర్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కవిత చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదనేలా హరీష్ క్లారిటీ ఇచ్చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోనే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద స్థానాలు గెలుస్తుందన్న హరీష్ రావు.. కార్యకర్తలను వేధించే వారి పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటామన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని వార్నింగ్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపై హరీష్ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. హరీష్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలకు క్లారిటీ వచ్చిందనేది ఆ పార్టీ నేతల మాట.