వర్షం ఎప్పుడు పడుతుందో, కరెంట్ ఎప్పుడు పోతుందో, సినిమా వాళ్ళు విడాకులు ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం కష్టం. అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళిళ్ళు అర్ధంతరంగా విడాకుల వరకు వెళ్తున్నాయి. సినిమాల్లో మేకప్ వేసుకుని వయసు పెరిగినా, ఫిట్నెస్ మెయింటేన్ చేస్తూ యాక్టివ్ గా కనపడే ప్రముఖులు.. తమ వ్యక్తిగత జీవితాల్లో మాత్రం అలా మ్యానేజ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. గొడవలకు ఎక్కువ కాలం మేకప్ వేసి లైఫ్ ను లీడ్ చేయలేకపోతున్నారు.
Also Read : యాపిల్ భారత్ లోనే ఉంటుంది.. ట్రంప్ కు టీం కుక్ షాక్
ఇప్పుడు మరో హీరోయిన్ రెడీ ఫర్ డైవర్స్ అనే సిగ్నల్ ఇచ్చేసింది. ఆమె ఎవరో కాదు, దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని.. 2022 లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. తన ఫ్రెండ్ భర్త సోహైల్ కతూరియాను గ్రాండ్ గా పెళ్లి చేసుకుని.. పెళ్లి డాక్యుమెంటరీ హన్సికస్ లవ్ షాదీ డ్రామా పేరుతో జియో హాట్ స్టార్ కు అమ్మేసారు. అందులో.. పెళ్లి అయిన వ్యక్తిని ప్రేమించి తాను ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డానో చెప్పుకొచ్చింది.
Also Read : ఉక్కిరి బిక్కిరి అవుతోన్న కేసీఆర్.. ఏం జరుగుతోంది..?
దీనికి అభిమానులు కూడా సపోర్ట్ చేసారు. హన్సిక – సోహైల్ పర్సనల్ లైఫ్ బాగా లీడ్ చేయాలని ఆకాంక్షించారు. కాని ప్రస్తుతం భర్తకు దూరంగా, పుట్టింట్లో ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆమె ఖండించలేదు. దీనితో ఖరారు చేసేసుకున్నారు ఫ్యాన్స్. ఇక లేటెస్ట్ గా తన భర్త తో సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు అన్నీ డిలీట్ చేసేసింది. తన భర్తకు ప్రపోజ్ చేసిన ఫస్ట్ ఫోటో నుంచి.. పెళ్లి వరకు ఏ ఫోటో లేకుండా డిలీట్ చేసేసింది. దీనితో ఇద్దరికీ బ్రేకప్ అయిపోయిందని, హార్ట్ బ్రేక్ ఎమోజీలు పెడుతూ.. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.