Tuesday, October 28, 2025 07:14 AM
Tuesday, October 28, 2025 07:14 AM
roots

విజయసాయి కి ఊహించని షాక్ ఇచ్చిన బాబు సర్కార్

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల విషయంలో అక్కడి ప్రభుత్వం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. చెరువులను, కాలవలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ప్రభుత్వం ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఖమ్మం నగరంలో కూడా ఇప్పుడు ఆ డ్రైవ్ కొనసాగే అవకాశం కనపడుతోంది. త్వరలోనే ఖమ్మంలో కూడా భారీగా కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం కనపడుతోంది. దీనిపై ఇప్పుడు ముందు అడుగు పడినట్టే తెలుస్తోంది.

విశాఖ నగరంలో అక్రమ నిర్మాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని స్థానిక ఎమ్మెల్యేలు సైతం డిమాండ్ చేయడం చూస్తూనే ఉన్నాం. మొన్నీ మధ్య ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు… అవసరమైతే అక్రమ నిర్మాణాలను తొలగించడానికి హైడ్రా తరహా వ్యవస్థను తీసుకోస్తామని ప్రకటించారు. తాజాగా ఆయన చెప్పినట్టుగానే భీమిలి లో అనధికార నిర్మాణల తొలగింపు కు రంగం సిద్ధం చేసారు అధికారులు.

Read Also : వైఎస్ జగన్, షర్మిల మధ్య రాజీ?

రాజ్యసభ సభ్యుడు విజయసాయి కుమార్తె కు జీవిఎంసి నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసారు. దానిపై కోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలు ఆపి.. వాటిని తొలగించాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అవ్యాన్ రియల్టర్స్ కు ఈనెల రెండో తేదీన నోటీసులు జారి చేసింది జీవిఎంసి. నోటీసులు అందిన 24 గంటల్లోగా అనధికార నిర్మాణం తొలగించాలని సూచనలు చేసి.. లేకుంటే తామే తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేసారు అధికారులు. నేడు వాటిని కూల్చేసి ప్రక్రియ అధికారులు చేపట్టి విజయసాయి కి షాక్ ఇచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్