Friday, September 12, 2025 09:17 PM
Friday, September 12, 2025 09:17 PM
roots

గ్రూప్ -2… తప్పు ఎవరిదీ..?

గ్రూప్ -2 పరీక్ష ఏపీలో పెద్ద దుమారం రేపింది. ఇంకా చెప్పాలంటే… పట్టుమని పది నెలలు కూడా పూర్తి కాని కూటమి ప్రభుత్వానికి కాస్త తలనొప్పిగా మారిందనేది వాస్తవం. సరిగ్గా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు గ్రూప్ – 2 పరీక్ష ప్రభుత్వానికి కాస్త ఇబ్బందే అనేది వాస్తవం కూడా. అయితే అసలు గ్రూప్ 2 పరీక్ష వివాదానికి కారణం ఏమిటనే విషయంపై ఇప్పుడు తెగ చర్చ నడుస్తోంది. గ్రూప్ 2 పరీక్ష విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఏదో తప్పు చేసినట్లు కొందరు అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కూడా. ఇక ఇదే అవకాశంగా తీసుకున్న కొందరు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరింత రెచ్చగొడుతున్నారు. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు వైసీపీ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read : బిజెపిలో ఆ ఇద్దరే దొంగలు.. రేవంత్ సంచలన కామెంట్స్

వాస్తవానికి ఏపీలో గ్రూప్ 2 వివాదం మొదలైంది వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే. నాలుగేళ్ల పాటు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేసిన జగన్… సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చాడు. 2023 డిసెంబర్‌లో 899 పోస్టులతో నోటిషికేషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ప్రిలిమ్స్ తర్వాత 92,250 మంది అర్హత సాధించారు. అయితే రోస్టర్ పాయింట్లను కావాలనే తప్పుగా ఇచ్చారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కూడా. కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు కూడా వేశారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. రోస్టర్ పాయింట్లు తప్పుగా ఇవ్వడంతో పరీక్ష రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. కూటమి ప్రభుత్వం కూడా రద్దు చేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి లబ్ది చేకూర్చేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమన్న ఏపీపీఎస్సీ… పరీక్ష రద్దు సాధ్యం కాదని స్పష్టం చేసింది.

Also Read : కూటమి సర్కార్‌కు ఝలక్.. జీవీ రెడ్డి రాజీనామా..!

దీంతో అభ్యర్థులంతా ఆందోళన చేపట్టారు. చివరికి అయిష్టంగానే పరీక్షకు కూడా హాజరయ్యారు. వాస్తవానికి ఇలాంటి అవకాశాన్ని రాజకీయ పార్టీలు గోల్డెన్ ఛాన్స్‌గా వాడుకుంటారు. కానీ జగన్ అండ్ కో మాత్రం… ఈ విషయంలో మాట్లాడేందుకు కూడా భయపడుతోంది. ఇందుకు ప్రధాన కారణం… తమ ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి.. ఈ విషయంపై ఎక్కడా మాట్లాడినా సరే… ఆ తప్పు చేసింది జగన్ సర్కార్ కదా అనే విషయం ప్రశ్నిస్తే… జవాబు చెప్పేందుకు కూడా ధైర్యం లేదు అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఎన్నికల్లో లబ్ది కోసం హడావుడి నోటిఫికేషన్, రోస్టర్‌లో తప్పులు… ఇలా ఈ గందరగోళం మొత్తానికి జగన్ కారణం… చివరికి పరీక్ష రద్దు చేయకూడదని ఎన్నికల సంఘానికి, ఏపీపీఎస్సీకి ఫిర్యాదులు చేసింది కూడా వైసీపీ నేతలే ఉన్నారనేది టీడీపీ, జనసేన నేతల ఆరోపణ. దీంతో ఎందుకొచ్చిన పీతలాటకం అన్నట్లుగా జగన్ బ్యాచ్ సైలెంట్ అయిపోయింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్