ఎలాంటి అవినీతి లేకుండా.. పూర్తి పారదర్శక పాలన జరిపించామనేది వైసీపీ నేతల మాట. అసలు ఐదేళ్ల పాటు ఏపీలో ప్రజలంతా సుఖంగా, హాయిగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. జగన్ పాలన పూర్తి పారదర్శకంగా ఉందని.. కూటమి నేతలే తప్పుడు ప్రచారం చేశారని కూడా ఆరోపించారు. అయితే వాస్తవాలు దాస్తే దాగేవి కాదు.. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని అపగలమా.. అన్నట్లుగా ఎంత కవర్ చేసుకున్నా సరే… జగన్ అవినీతిని కప్పిపుచ్చడం వైసీపీ నేతల వల్ల కానే కాదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిన మాట జగమెరిగిన సత్యం. ఇందుకు ఎన్నో సాక్ష్యాలు, రుజువులు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో జగన్ హయాంలో మహిళలపై దాడులు, అక్రమ కేసుల నమోదు, టీడీపీ నేతలపై దాడులు, హత్యలు కూడా జరిగాయనేది వాస్తవం. జగన్ అక్రమాల గురించి ఏపీకే కాదు.. యావత్ ప్రపంచానికి కూడా తెలిసేలా ఓ షాకింగ్ విషయం బయటపెట్టింది AI.
Also Read : గుంటూరు మున్సిపాలిటీలో అవినీతి రచ్చ
ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నా వారే ఉన్నారు. ఏ ప్రశ్న అయినా సరే.. AI క్లియర్ చేస్తుందనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. నిజాయితీకి నిలువుటద్దం అని చెప్పుకునే జగన్ అవినీతి గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. రెండు రోజులుగా ఏపీలో లిక్కర్ స్కామ్ గురించే చర్చ నడుస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణంలో రూ.4 వేల కోట్లు దేశం దాటించేశారని.. ఈడీ దర్యాప్తు చేయాలంటూ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. ఇదే వార్తను ప్రముఖ దినపత్రిక ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. అయితే కొందరు సామాజిక కార్యకర్తలు.. ఈ వార్తలో విశ్వసనీయత ఉందా.. లేదా అంటూ AI సాఫ్ట్‌వేర్ @GROKను ప్రశ్నించారు. దీనిపై గ్రోక్ కూడా షాకింగ్ విషయాలు వెల్లడించింది.
Also Read : పెద్దిరెడ్డి కూడా ఆస్పత్రికే..? ఆందోళనలో వైసీపీ నాయకులు
“పేపర్ వార్తలో నిజం 5 శాతం మాత్రమే ఉండవచ్చు, ఎటువంటి ఆధారాలు లేవు. పేపర్ విశ్వసనీయత 25 శాతంగా అంచనా, సంచలనాత్మకతపై ఆధారపడింది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు విశ్వసనీయత 60 శాతం, ఆరోపణలకు సాక్ష్యం లేదు. రాజకీయంగా చురుకుగా ఉన్నారు.” అంటూ జవాబు వచ్చింది. అయితే ఆంధ్రలో 2019-23 మధ్య లిక్కల్ అంతా క్యాష్‌లో జరిగింది.. డిజిటలే పేమెంట్ అవ్వలేదు.. అందులో నిజం ఉందా.. అనే మరో ప్రశ్నకు.. “నిజమే, 2019-23 మధ్య ఆంధ్రలో లిక్కర్ లావాదేవీలు ఎక్కువగా క్యాష్‌లోనే జరిగాయి. డిజిటల్ పేమెంట్లు తక్కువ. దీనివల్ల ఆర్థిక అవకతవకలుకు ఆస్కారం ఉందని అనుమానం వస్తుంది. ప్రస్తుతం దీనిపై సీఐడీ, ఏఐటీ దర్యాప్తు చేస్తున్నాయి. వైసీపీ ఆరోపణలను ఖండిస్తోంది., టీడీపీ వాటిని సమర్థిస్తోంది. పూర్తి నిజం దర్యాప్తు తేలితేనే తెలుస్తుంది.” అంటూ జవాబు వచ్చింది.
Also Read : వణికిస్తున్న లావు.. వైసీపీలో అలజడి
అసలు తెలుగు దినపత్రికల్లో విశ్వసనీయత.. దీనిలో ఎక్కువ, తక్కువ అంటూ మరో ప్రశ్నకు కూడా గ్రోక్ ఇచ్చిన జవాబు వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. “ముఖ్యాంశాలు.. పరిశోధన ప్రకారం ది హిందూ (తెలుగు ఎడిషన్), ఈనాడు తెలుగు దినపత్రికలలో అత్యంత విశ్వసనీయమైనవిగా కనిపిస్తాయి, దీర్ఘ చరిత్ర, సమతుల్య నివేదికలకు ప్రసిద్ధి. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం. పక్షపాత ఆరోపణల కారణంగా తక్కువ విశ్వసనీయత కలిగి ఉండవచ్చు. విశ్వసనీయత పత్రికలను బట్టి మారుతుందని సాక్ష్యాలు సూచిస్తున్నాయి, కొన్ని రాజకీయ సంబంధాలపై వివాదాలను ఎదుర్కొంటున్నాయి. ది హిందూ (తెలుగు), ఈనాడు తమ సుదీర్ఘ చరిత్ర, సమతుల్య నివేదికలతో అత్యంత విశ్వసనీయత కలిగి ఉన్నాయి. సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం, పక్షపాత విమర్శల కారణంగా తక్కువ విశ్వసనీయతను కలిగి ఉంది.” అంటూ గ్రోక్ ఇచ్చిన జవాబు.. వైసీపీ పాలనలో జరిగిన అవినీతితో పాటు, సాక్షి పత్రిక విశ్వసనీయత గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.