తన శాఖతో పాటు పేరులోనూ వెలుగులు నింపుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గ విద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల్లోంచి పుట్టిన పీ4 విధానాన్ని ఆదర్శంగా తీసుకున్న మంత్రి గొట్టిపాటి, అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.50 లక్షల సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతో పేద విద్యార్థులు చదువుకునే అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లతో పాటు లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సుమారు 76 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సాంఘిక, సంక్షేమ, గిరిజన, వెనుకబడిన విద్యార్థుల హాస్టళ్లలో 1,009 ఫ్యాన్లతో పాటు 1,160 లైట్ల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది.
Also Read : బాబు సర్కార్ కీలక నిర్ణయం.. జగన్‌పై కూడా ఎఫెక్ట్..!
అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎస్ఆర్ నిధులతో స్థానిక విద్యా సంస్థల అభివృద్ధి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుకు వినియోగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సుమారు 10 నెలల కాలంలోనే అద్దంకి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు ఇప్పటి వరకు 550కు పైగా సైకిళ్లను పంపిణీ చేశారు. రానున్న కాలంలో నియోజకవర్గంలో చదువుకుంటున్న ప్రతీ విద్యార్థినికి కూడా సైకిళ్లను పంపిణీ చేయాలని సంకల్పించారు. సుమారు 10 వేలకు పైగా సైకిళ్లను నియోజకవర్గం వ్యాప్తంగా ఉచితంగా అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దివ్యాంగులకు సుమారు 58 మోటారు త్రి చక్ర వాహనాలను సీఎస్ఆర్ నిధులతో అందజేశారు. అంతేగాకుండా నియోజకవర్గంలో వీధి వ్యాపారుల కోసం 300 తోపుడు బళ్లను త్వరలోనే పంపిణీ చేయనున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని జె.పంగలూరు, అద్దంకి, సంతమాగలూరు, బల్లికురవ, కొరిశపాడు మండలాల పరిధిలోని అభివృద్ధిలో మంత్రి గొట్టిపాటి తనదైన ముద్ర వేశారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన విద్య అందించేందుకు తనకున్న విచక్షణాధికారాన్ని సైతం వినియోగిస్తున్నారు. విద్యాలయాలు, హాస్టళ్లు సందర్శన సమయంలో విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. నాణ్యమైన విద్యతోనే… మెరుగైన సమాజం అని నమ్మిన మంత్రి గొట్టిపాటి… మంచి వాతావరణంలో విద్యను అందిస్తాము.., కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
Also Read : ఆందోళనకరంగా వంశీ ఆరోగ్యం..?
ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్, అద్దంకి నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే నిధులతో నియోజకవర్గంలో రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు స్థానిక కంపెనీలు వెచ్చించే సీఎస్ఆర్ నిధులతో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. అవసరార్థం తన వద్దకు వచ్చిన వారందరి సమస్యలను.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకే అద్దంకి నియోజకవర్గంలో 2004 నుంచి ప్రతి ఎన్నికలో కూడా గొట్టిపాటి రవి విజయం సాధిస్తూనే ఉన్నారు.